బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పెళ్లికి సిద్ధమవుతున్నాడు. అది కూడా అతడి మాజీ ప్రేయసి కత్రినా కైఫ్ తో.. వీరిద్దరూ త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారు. అయితే ఇది రియల్ లైఫ్ లో మాత్రం కాదు.. రీల్ లైఫ్ లో.

వీరిద్దరూ కలిసి నటిస్తోన్న 'భారత్' సినిమాలో సల్మాన్, కత్రినాల పెళ్లి సన్నివేశాలు ఉంటాయట. ఓ భారీ వెడ్డింగ్ సీన్ ని ప్లాన్ చేశాడు దర్శకుడు. కొద్ది రోజుల్లో దీనికి సంబంధించిన షూటింగ్ మొదలుకానుంది.

అందుతున్న సమాచారం ప్రకారం సల్మాన్, కత్రినాలు వెడ్డింగ్ సీక్వెన్స్ కు సంబంధించిన షూటింగ్ లో పాల్గొనున్నారు. ఇటీవల 'భారత్' సినిమా టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ టీజర్ అభిమానుల్లో సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసింది. 

అలీ అబ్బాస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను అతుల్ అగ్నిహోత్రి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో సల్మాన్, కత్రినాలతో పాటు జాకీష్రాఫ్, దిశా పటానీ, సునీల్ గ్రోవర్ తదితరులు నటిస్తున్నారు. ఈ ఏడాది ఈద్ సందర్భంగా సినిమాను విడుదల చేయనున్నారు.