ఇండియన్ బాక్స్ ఆఫీస్ ధీరుడు సల్మాన్ ఖాన్ నెక్స్ట్ భారత్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కత్రినా కైప్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా జూన్ 5న రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో సల్మాన్ సినిమాకు సంబందించిన ప్రమోషన్స్ డోస్ పెంచాడు. 

ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో సల్మాన్ తనపై వస్తోన్న కొన్ని రూమర్స్ గురించి క్లారిటీ ఇచ్చాడు. మెయిన్ గా వివిధ సౌత్ సినిమాలను రీమేక్ చేయాలని సల్మాన్ ఆలోచిస్తున్నట్లు కథనాలు వెలువడ్డాయి. అందులో మహేష్ మహర్షి సినిమాకు కూడా ఉన్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ రూమర్స్ లో ఎలాంటి నిజం లేదని సల్మాన్ క్లారిటీ ఇచ్చాడు. 

అసలు ఆ సినిమా కూడా నేను ఇంతవరకు చూడలేదని సల్మాన్ వివరణ ఇచ్చాడు. గతంలో కెరీర్ స్ట్రగుల్ అవుతున్న సమయంలో పోకిరి రీమేక్ తో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న సల్మాన్ ఆ తరువాత మహేష్ శ్రీమంతుడు సినిమాపై కూడా మనసు పారేసుకున్నాడు. ఆ సినిమా నచ్చిందని పలు ఇంటర్వ్యూల్లో చెప్పిన సల్మాన్ రీమేక్ పై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.