సల్మాన్ ఖాన్ - కత్రినా కైఫ్ ల గురించి నిత్యా ఎదో ఒక రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కామన్. ఒకప్పుడు ఎంతో ప్రేమగా చెట్టాపట్టాలేసుకొని తిరిగిన ఈ జంట కొన్నాళ్లకే విడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తరువాత సల్మాన్ ఖాన్ పెళ్లి అనే కార్యాన్ని మర్చిపోయాడు. లైఫ్ లో పెళ్లి చేసుకోను అని ప్రతిసారి చెబుతూ వస్తున్నాడు. 

ఇక కత్రినా ఆ ప్రస్తావన వస్తే తెలివిగా నవ్వుతో నో కామెంట్స్ అంటూ తప్పించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అసలు మ్యాటర్ లోకి వస్తే ఈ కాంబినేషన్ లో బ్రేకప్ తరువాత కూడా చాలా సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి కూడా. ఇకపోతే ప్రస్తుతం భరత్ సినిమాలో నటిస్తోన్న వీరిద్దరి రీసెంట్ గా ఒక ఫోటో షూట్ లో పాల్గొన్నారు. 

అది చూసిన అభిమానులు బెస్ట్ కపుల్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు. హ్యాపీగా పెళ్లి చేసుకోండని ఎందుకు ప్రేమను దాచి మోసం చేస్తున్నారు అని కూడా కామెంట్ చేస్తున్నారు. వారి స్మైల్ చూస్తుంటే అలానే అనిపిస్తోందని మరికొంత మంది వారి అభిప్రాయాలను తెలుపుతున్నారు. దీంతో ఆ కామెంట్స్ కాస్త ఇప్పుడు బాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక భరత్ సినిమా ఈ ఏడాది జూన్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.