ఇండియాలో అత్యధిక ఆదరణ పొందిన బాలీవుడ్ బిగ్ బాస్ షో సీజన్ 13 సెప్టెంబర్ 29న మొదలు కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సారి కూడా సల్మాన్ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నాడు. 2010 లో బిగ్ బాస్ హోస్ట్ గా టెలివిజన్ సైడ్ కెరీర్ ను మొదలుపెట్టిన సల్మాన్ కు ఇది 10వ సీజన్ కానుంది. 

మధ్యలో కొంతమంది సల్మాన్ కి పోటీ ఇవ్వడానికి వచ్చినప్పటికీ షోలు అంతగా క్లిక్కవ్వలేదు. మళ్ళీ సల్మాన్ అయితేనే బిగ్ బాస్ కి బెస్ట్ అని నిర్వాహకులు అతనికి అడిగినంత ఇస్తూ వస్తున్నారు. ఇక ఇప్పుడు 13వ సీజన్ కోసం సల్మాన్ కి బిగ్ బాస్ నిర్వాహకులు 403కోట్ల రెమ్యునరేషన్ ని ఇవ్వనున్నారని టాక్ వస్తోంది. 

అంటే సల్మాన్ ఎపిసోడ్ కి 31కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నాడట. జరిగే 26 ఎపిసోడ్లకు సల్మాన్ ఈ విధమైన రేటు చెప్పడం నిర్వాహకులకు మింగుడుపడటం లేదు. మరో హీరోతో వర్క్ చేద్దామంటే సల్మాన్ రేంజ్ లో ఎవరు షోని లీడ్ చేయలేకపోతున్నారు. అందుకే చేసేదేమి లేక అడిగినంత ఇచ్చేస్తున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి.