‘సలార్’ టీమ్ బిగ్ అనౌన్స్ మెంట్ కు సిద్ధమైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న Salaar Trailer ను రిలీజ్ చేసేందుకు డేట్ ఫిక్స్ అయ్యింది. తాజాగా అఫీషియల్ అప్డేట్ అందింది.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నిన్ననే యూరప్ నుంచి హైదరాబాద్ కు తిరిగి వచ్చారు. ఆయన రాకనే పండగలా ఫీల్ అయినా అభిమానులకు పండగ చేసుకునే అప్డేట్ అందింది. డార్లింగ్ నటిస్తున్న భారీ యాక్షన్ ఫిల్మ్ ‘సలార్’ కోసం అభిమానులు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. మరో 40 రోజుల్లో ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. దీంతో ప్రమోషన్స్ పై యూనిట్ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు అభిమానులకు కావాల్సిన అసలు సిసులైన అప్డేట్ అందించారు మేకర్స్.
ఇక ఇప్పటికే Salaar Cease Fire పై భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్ విడుదలైన ఒక్కరోజులోనే 100 మిలియన్ల వరకు వ్యూస్ దక్కించుకొని సెన్సేషన్ క్రియేట్ చేసింది. దాంతో ట్రైలర్ పై భారీ అంచనాలు పెరిగాయి. అభిమానులు, నార్మల్ ఆడియెన్స్ కూడా ఈ మూవీ ట్రైలర్ కోసం ఎదురుచూస్తున్నారు. డార్లింగ్ హైదరాబాద్ లో అడుగుపెట్టగానే ‘సలార్’ టీమ్ బిగ్ అనౌన్స్ మెంట్ చేసింది. ట్రైలర్ ను సిద్ధం చేసినట్టు రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించింది.
త్వరలో సలార్ ట్రైలర్ అంటూ తాజాగా ఓ పోస్టర్ ను విడుదల చేశారు. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. దీపావళి సందర్బంగా ట్రైలర్ డేట్ ను ఇవ్వబోతున్నారని అంటున్నారు. ఇక ట్రైలర్ ను డిసెంబర్ 1న విడుదల చేయబోతున్నారని సమాచారం. దీనిపై క్లారిటీ లేదు. మరో రెండురోజుల్లో ట్రైలర్ డేట్ రాబోతుందని తెలుస్తోంది. ఏదేమైనా సలార్ నుంచి బిగ్ అప్డేట్ అందడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఈ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని ప్రశాంత్ నీల్ (Prashanth) డైరెక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ‘కేజీఎఫ్’ మేకర్స్ హోంబలే ఫిల్మ్స్ పతాకంపై రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం ప్యాచ్ వర్క్ లు, పోస్ట్ ప్రోడక్షన్ జరుగుతోంది. ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు విలన్లుగా నటిస్తున్నారు. శ్రియా రెడ్డి, సప్తగిరి కీలక పాత్రలు పోషిస్తున్నారు. డిసెంబర్ 22న అన్నీ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.

