ఈ ఏడాది ప్రభాస్ నుంచి రాధేశ్యామ్ మూవీ వచ్చింది. కాని ఈ సినిమా ప్రభాస్ తో పాటు ఆయన ఫ్యాన్స్ ను కూడా నిరాశపరిచింది. ఇక ఈ ఏడాది ప్రభాస్ నుంచి మరో రెండు సినిమాలు వస్తాయని ప్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకుంటే.. ఒక సినిమాపై నిరాశే ఎదురయ్యేలా కనిపిస్తుంది.
ఈ ఏడాది ప్రభాస్ నుంచి రాధేశ్యామ్ మూవీ వచ్చింది. కాని ఈ సినిమా ప్రభాస్ తో పాటు ఆయన ఫ్యాన్స్ ను కూడా నిరాశపరిచింది. ఇక ఈ ఏడాది ప్రభాస్ నుంచి మరో రెండు సినిమాలు వస్తాయని ప్యాన్స్ ఎన్నో ఆశలు పెట్టుకుంటే.. ఒక సినిమాపై నిరాశే ఎదురయ్యేలా కనిపిస్తుంది.
ప్రభాస్ హీరోగా కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న సినిమా సలార్. విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్న ఈ సినిమాకి రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తున్నారు.ప్రభాస్ ను సలార్ లో ప్రశాంత్ నీల్ పక్కా మాస్ యాక్షన్ హీరోగా చూపించనున్నాడు. పోస్టర్ చూస్తేనే ప్రభాస్ ఎలా ఉండబోతున్నాడో తెలుస్తుంది. ఈ సినిమా సడెన్ గా అనౌన్స్ చేసి.. ఫాస్ట్ గా షూటింగ్ స్టార్ట్ చేశారు టీమ్.
అయితే మధ్యలో కరోనా ప్రభావం, ప్రభాస్ రాధేశ్యామ్ పై పూర్తి దృష్టి పెట్టడంతో పాటు, యంగ్ రెబల్ స్టార్ ఆది పురుష్ ను ముందుగా పూర్తి చేయాలనుకోవడం వలన, సలార్ షూటింగ్ లేట్ అవుతూ వస్తోంది. లేకపోతే ఇప్పటికి ఈ సినిమా షూటింగ్ అయిపోయేది. అందులోను ఎప్పుడో స్టార్ట్ అయిన ఈ సినమా షూటింగ్ ఇప్పటికీ ఏ స్టేజ్ లో ఉందో కూడా ఎవరికి తెలియడం లేదు. సినిమా టీమ్ కూడా ఇంత వరకూ అప్ డేట్ ఇవ్వలేదు.
అయితే రాధేశ్యామ్ తో పాటు సలార్, ఆది పురుష్ సిమాలు కూడా ఈ ఏడాది చివరి వరకూ రిలీజ్ చేస్తారన్న నమ్మకంతో ఉన్నారు ప్యాన్స్. కాని అది జరిగేలా కనిపించడం లేదు. సలార్ స్టార్ట్ అయ్యి కూడా ఏడాదిన్నర పైనే అవుతుంది. అయినా ఈ మూవీని నెక్ట్స్ ఇయర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
ఈ నేపథ్యంలోనే సలార్ సినిమా నిర్మాత మాట్లాడుతూ ఇంతవరకూ ఈ సినిమా 30 శాతం షూటింగ్ జరుపుకుంది. మే నుంచి నెక్ట్స్ షెడ్యూల్ షూటింగు మొదలవుతుంది అన్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాము అన్నారు. శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో, జగపతిబాబు ఒక కీలకమైన పాత్రను పోషిస్తున్నారు.
