సారాంశం
సలార్ నిర్మాతలు తమ ‘హోంబలే ఫిల్మ్స్’బ్యానర్ పై ‘యువ’ అనే సినిమాచేస్తున్నారు. కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ మనవడు అయిన ‘యువ రాజ్ కుమార్’ని హీరోగా ...
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం సలార్ రిలీజ్ డేట్ కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. కేజీఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై భారీ ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. సెప్టెంబర్ 28వ తేదీన రిలీజ్ కావాల్సిన ‘సలార్: పార్ట్ 1 - సీజ్‍ఫైర్’ఫోస్ట్ ఫోన్ అయ్యింది. సలార్‌ను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన చిత్రయూనిట్.. కొత్త రిలీజ్ డేట్‍ను వెల్లడించలేదు. అయితే, తాజాగా ‘సలార్: పార్ట్ 1 - సీజ్‍ఫైర్’ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందంటూ వార్త ప్రచారంలోకి వచ్చింది. డిసెంబర్ 22 న ఈ చిత్రం రిలీజ్ కానుందని వార్త సారాంశం. ఈ విషయం బాలీవుడ్ మీడియా సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా బయిటకు వచ్చింది. అయితే అదే రోజున షారూఖ్ ఖాన్ తాజా చిత్రం డుమ్కీ కూడా రిలీజ్ అవుతోంది. దాంతో మంచి ఫామ్ లో ఉన్న షారూఖ్ కు ఎదురెళ్లి మరీ సలార్ రిలీజ్ చేస్తారా, థియేటర్స్ ఇబ్బంది వస్తుంది కదా అని అందరికీ సందేహం వస్తుంది. అలాగే ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉంది.
సలార్ నిర్మాతలు తమ ‘హోంబలే ఫిల్మ్స్’బ్యానర్ పై ‘యువ’ అనే సినిమాచేస్తున్నారు. కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ మనవడు అయిన ‘యువ రాజ్ కుమార్’ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ హోంబలే ఫిల్మ్స్ ‘యువ’ అనే సినిమాచేస్తోంది. పునీత్ రాజ్ కుమార్ కి సూపర్ హిట్స్, యష్ ని సూపర్ స్టార్ ని చేసిన రైటర్-డైరెక్టర్ సంతోష్ ఆనంద్ దర్శకత్వంలో ‘యువ’ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా కూడా అదే రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసింది ఈ సంస్ద. అయితే డేట్ ని వాయిదా వేస్తున్నట్లు చెప్పలేదు.
దాంతో డిస్ట్రిబ్యూటర్స్ అదే రోజు ‘యువ’ రిలీజ్ చేయటానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు అదే తేదీన ‘సలార్: పార్ట్ 1 - సీజ్‍ఫైర్’రిలీజ్ చేస్తారు అంటే నమ్మటం కష్టమే. అటు షారూఖ్ సినిమా వాయిదా పడటం కష్టమే. తమ చేతిలో ఉంది కాబట్టి మహా అయితే ‘యువ’ రిలీజ్ ని ప్రక్కన పెడతారు. కాబట్టి సలార్ కొత్త రిలీజ్ డేట్ అఫీషియల్ ఎనౌన్సమెంట్ వచ్చేదాకా కన్ఫర్మ్ గా అనుకోవటం అనవసరం. ‘హోంబలే ఫిల్మ్స్’ ప్రొడక్షన్ హౌజ్ KGF, కాంతర లాంటి క్వాలిటీ సినిమాలని ప్రొడ్యూస్ చేసింది. చాలా ప్లానింగ్ గా వెళ్తుంది ఈ ప్రొడక్షన్ హౌస్.
ఏదైమైనా ఈ చిత్రం కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారనటంలో సందేహం లేదు. ప్రభాస్ ఈ సినిమాపై బాగా నమ్మకాలు పెట్టుకున్నారు. ఈ ఏడాది ఆదిపురుష్ తో ప్రభాస్ పెద్ద డిజాస్టర్ అందుకోవడంతో అభిమానులందరూ.. ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ బాగా ఆకట్టుకున్నాయి. ఇంకా ఈ చిత్రం నిమిత్తం కొన్ని రీ షూట్ లు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.త్వరలనే సలార్ రిలీజ్ డేట్ మిస్టరీ వీడుతుందనే ఆశిద్దాం.