`సలార్‌` మూవీ బాక్సాఫీసు వద్ద రచ్చ చేస్తుంది. ప్రభాస్‌ హీరోగా నటించిన ఈ మూవీ భారీ వసూళ్లని రాబడుతుంది. తాజాగా టీమ్‌ సినిమా మేకింగ్‌ వీడియోని విడుదల చేశారు. 

`సలార్‌` సినిమా బాక్సాఫీసు వద్ద మంచి ఆదరణ పొందుతుంది. చాలా రోజుల తర్వాత ప్రభాస్‌ ని పూర్తి మాస్‌, యాక్షన్‌ అవతార్‌లో చూడటంతో అభిమానులకు ప్రాణం లేచి వచ్చింది. డార్లింగ్‌ ఈజ్‌ బ్యాక్‌ అని వారంతా ఫీల్‌ అవుతున్నారు. ఫ్యాన్స్ తోపాటు సాధారణ ఆడియెన్స్ కూడా సినిమాని ఎంజాయ్‌ చేస్తున్నారు. `సలార్‌` భారీ కలెక్షన్ల దిశగా వెళ్తుంది. నాలుగు రోజుల వీకెండ్‌ ఈ మూవీకి కలిసొచ్చే అంశం. 

ఇదిలా ఉంటే తాజాగా `సలార్‌`కి సంబంధించిన మేకింగ్‌ వీడియోని పంచుకుంది యూనిట్‌. సినిమా షూటింగ్‌ సమయంలో టీమ్‌ పడ్డ కష్టాన్ని ఇందులో చూపించారు. ప్రభాస్‌ని దేవగా ఆవిష్కరించేందుకు, ఆయన చేసే యాక్షన్‌, ఎలివేషన్లని తీసేందుకు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌, ఆయన బృందం ఎంతగా కష్టపడ్డారో ఇందులో చూపించారు. అలాగే ఖాన్సార్‌ సామ్రాజ్యం, వరధ పాత్ర, ప్రభాస్‌ యాక్షన్‌ ఎపిసోడ్లని ప్రధానంగా చూపించారు. 

మరోవైపు ఖాన్సార్‌ కోట, అందులో చాలా మంది జనాలతో షూటింగ్‌, కాటేరమ్మ యాక్షన్‌ ఎపిసోడ్‌, బీజీఎం కోసం మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎంత కష్టపడారో ఇందులో చూపించారు. మొత్తంగా `సలార్‌` విధ్వంసం వెనుక జరిగిన కథని ఈ మేకింగ్‌ వీడియో రూపంలో విడుదల చేసింది టీమ్‌. ప్రస్తుతం ఇది యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుంది. మూడు రోజుల్లో ఈ మూవీ రూ.330కోట్ల వసూలు చేసిందని సమాచారం. కానీ చిత్ర బృందం మాత్రం నాలుగు వందల కోట్లకుపైగా వసూళు చేసినట్టు వెల్లడించింది. 

ఇక ప్రభాస్‌ హీరోగా రూపొందిన `సలార్‌`లో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ముఖ్య పాత్ర పోషించారు. శృతి హాసన్‌ హీరోయిన్‌. హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. డిసెంబర్ 22న ఇది విడుదలైంది. స్నేహం ప్రధానంగా సినిమా తెరకెక్కింది. ఫ్రెండ్స్ గా ఉండే వరధ, దేవాలు త్రువులుగా మారే కథతో ఈ మూవీని రూపొందించారు. ఎందుకు శత్రువులు అయ్యారనేది రెండో పార్ట్ లో చూపించబోతున్నారు. దాన్ని `సలార్‌ః శౌర్యంగ పర్వం` పేరుతో తెరకెక్కించనున్నారు. 

YouTube video player