ఇటీవల విడుదలైన `సలార్` టీజర్ ఆకట్టుకుంది. మొదట మిశ్రమ స్పందన లభించినా, ఆ తర్వాత దుమ్మరేపింది. రికార్డులు క్రియేట్ చేసింది. ఇక `సలార్` టైమ్ స్టార్ట్ కాబోతుంది. తొలి పాట రాబోతుంది.
ప్రభాస్ నెల రోజుల క్రితం `ఆదిపురుష్`తో అలరించారు. ఆ సినిమా డిజాస్టర్ టాక్ వచ్చినా, సుమారు 400కోట్ల గ్రాస్ టచ్ అయ్యింది. అది ప్రభాస్ రేంజ్‌ని చాటి చెప్పిందని చెప్పొచ్చు. ఇప్పుడు మరో సినిమాతో రాబోతున్నారు. మరో రెండు నెలల్లో డార్లింగ్ నటించిన `సలార్` రిలీజ్ కానుంది. ప్రభాస్ గత చిత్రాలు డిజప్పాయింట్ చేసినా, `సలార్` మాత్రం గ్యారంటీ హిట్, బ్లాక్ బస్టర్ అనే టాక్ అందరిలోనూ ఉంది. దర్శకుడు ప్రశాంత్ నీల్‌పై నమ్మకంతో అంతా ఉన్నారు. ఈ సినిమాపై అందరిలోనూ భారీ అంచనాలున్నాయి.
దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఇటీవల విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. మొదట మిశ్రమ స్పందన లభించినా, ఆ తర్వాత దుమ్మరేపింది. రికార్డులు క్రియేట్ చేసింది. ఇక `సలార్` టైమ్ స్టార్ట్ కాబోతుంది. ఆగస్ట్ లో క్రేజీ అప్‌డేట్లు ఉంటాయని ఇప్పటికే చిత్ర నిర్మాణ సంస్థ `హోంబలే ఫిల్మ్స్` ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అందుకు తగ్గట్టుగానే అప్‌డేట్లు రెడీ చేస్తున్నారట ప్రశాంత్‌నీల్. మొదటగా ఈ నెలలో ఫస్ట్ సింగిల్‌ని విడుదల చేయబోతున్నారట. తాజాగా దీనికి సంబంధించిన ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఆగస్ట్ రెండో వారంలో మొదటిపాటని విడుదల చేయనున్నారు. సినిమాలో ప్రభాస్ పాత్రని ఎలివేట్ చేసేలా, హీరోయిజాన్ని ఆవిష్కరించేలా ఈ పాట సాగుతుందని తెలుస్తుంది.
మరోవైపు ట్రైలర్‌ని కూడా విడుదల చేస్తామని చిత్ర బృందం తెలిపింది. ఆగస్ట్ మూడు, నాల్గో వారాల్లో `సలార్` ట్రైలర్‌ని విడుదల చేసే అవకాశం ఉంది. ఇలా రెండో వారం నుంచి `సలార్` నుంచి బ్యాక్ టూ బ్యాక్ అప్డేట్లు రానున్నట్టు సమాచారం. ఇదే అయితే ఇక ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే అని చెప్పొచ్చు. ఇక `సలార్` బిజినెస్‌కి సంబంధించిన వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రం థియేట్రికల్, నాన్ థియేట్రికల్ ఇలా అన్నీ కలుపుకుని సుమారు రూ.750కోట్ల మేర బిజినెస్ జరుగుతుందని తెలుస్తుంది.
ఇందులో మ్యూజిక్ రైట్స్ తోపాటు శాటిలైట్ రైట్స్ రూ.160కోట్లకు అమ్ముడు పోయాయని సమాచారం. అలాగే డిజిటిల్ (ఓటీటీ) రైట్స్ ఏకంగా 175కోట్లకి సేల్ అయ్యాయని తెలుస్తుంది. థియేట్రికల్‌గా ఇది 350కోట్లకుపైగా పలుకుతుందని, ఇది 400కోట్లకు పోయే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇదే జరిగితే ఇండియన్ సినిమాల్లోనే ఇప్పటి వరకు రిలీజ్‌కి ముందు ఇంతటి భారీ బిజినెస్ జరిగిన మూవీగా `సలార్` నిలుస్తుందని చెప్పొచ్చు. ఈ లెక్కన ఈ చిత్రం మినిమమ్ వెయ్యి కోట్లు వసూలు చేయాలి. అప్పుడే సేఫ్ ప్రాజెక్ట్ అవుతుంది. మేకర్స్ మాత్రం రెండువేల కోట్లు టార్గెట్ పెట్టుకున్నట్టు సమాచారం.మరి దాన్ని రీచ్ అవుతుందా అనేది చూడాలి.
ఇక `సలార్` కథకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఆ మధ్య వైరల్ అయ్యింది. `సలార్` స్టోరీ.. 1980లో జరుగుతుందట. సున్నపు రాయి మాఫియా నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందట. ఈ సున్నపు రాయి ఫార్మాకి, యూఎస్ ఆర్మీకి లింక్ ఉంటుందట. ఈ క్రమంలో సలార్.. యూఎస్ ఆర్మీతో పోరాడాల్సి వస్తుందని తెలుస్తుంది. సినిమాలో కొన్ని యాక్షన సీన్లు విదేశాల్లోనూ సాగుతాయని, అందుకోసం ఇటలీలో చిత్రీకరించినట్టు సమాచారం. ఆయా ఎపిసోడ్‌లు సినిమాకిహైలైట్‌గా, నెవర్ బిఫోర్ అనేలా ఉంటాయని సమాచారం. అలాగే ఈ కథకి `కేజీఎఫ్2` కథకి సంబంధం ఉంటుందట. మరి ఏది నిజమనేది తెలియాలంటే మరో రెండు నెలలు ఆగాల్సిందే. శృతి హాసన్ కథానాయికగా, పృథ్వీరాజ్ సుకుమార్ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 28న విడుదల కానుంది.
