లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ పై ప్రశాంత్ నీల్ ఓపీనియన్ ఇదే? ఏమన్నారంటే..
లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ తో ఆడియెన్స్ ను తనవైపు తిప్పుకున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా Salaar ను తెరకెక్కించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ LCUపై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు.
కోలీవుడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) తీసినవి కొన్ని సినిమాలే అయినా సక్సెస్ రేటు మాత్రం అధికంగా ఉండేలా చూసుకున్నారు. ఇక ‘ఖైదీ’, ‘విక్రమ్’తో ఏకంగా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ ను పరిచయం చేశారు. దీంతో ఆయన కమింగ్ మూవీస్ పై చాలా ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం సోషల్ మీడియాకూ బ్రేక్ తీసుకున్నారు. నెక్ట్స్ తలైవా171పై ఫోకస్ పెట్టారు. ఈ సందర్భంగా కొద్దిరోజులు తను ఎవరికీ అందుబాటులో ఉండనని చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఎక్కడ చూసినా Salaar ముచ్చట్లే వినిపిస్తున్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) ఫ్యాన్స్ సందడే కనిపిస్తోంది. మరోవైపు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) గురించి కూడా ఇంట్రెస్టింగ్స్ న్యూస్ కనిపిస్తూనే ఉంది. అయితే ప్రమోషన్స్ లో ఆయన మాట్లాడిన కొన్ని మాటలు వైరల్ గా మారాయి. ముఖ్యంగా ప్రశాంత్ నీల్ ‘కేజీఎఫ్’, ‘సలార్’తో సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేశారని అంతా అనుకుంటుండగా.. రీసెంట్ ఇంటర్వ్యూలో అదేం లేదని స్పష్టం చేశారు.
కేజీఎఫ్, సలార్ రెండు వేర్వేరు ప్రపంచాలని తెలిపారు. సినిమాటిక్ యూనివర్స్ ను క్రియేట్ చేయలేదని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)పైనా మాట్లాడారు. ఇండియాలో మొదట సినిమాటిక్ యూనివర్స్ ను క్రియేట్ చేసింది లోకేష్ కనగరాజ్ మాత్రమే అన్నారు. అలా సినిమాటిక్ యూనివర్స్ చేయడం చాలా కష్టమైన పని అని చెప్పుకొచ్చారు. నేను దానిపై ప్రస్తుతం శ్రద్ధ పెట్టలేదన్నారు. ఇక రాజమౌళి డ్రామాను చిత్రీకరించే తీరు ఎంతో అద్భుతంగా ఉంటుందని, తనకు నచ్చుతుందని చెప్పుకొచ్చారు.
ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా Salaar Cease Fire ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రభాస్ విశ్వరూపానికి ఫిదా అవుతున్నారు. అంతటా అద్భుతమైన టాక్ కనిపిస్తోంది. రివ్యూలు కూడా అదిరిపోయాయి. ఈ క్రమంలో ఫస్ట్ డే కలెక్షన్లు ఏ మేరకు వసూళ్లు అయ్యాయనేది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ శృతిహాసన్ కథానాయిక. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, శ్రియా రెడ్డి, టిన్ను ఆనంద్, ఈశ్వరీ రావు, కీలక పాత్రలు పోషించారు.