Salaar Cease Fire : ‘సలార్’ రన్ టైమ్ ఎంతో తెలుసా? ఫ్యాన్స్ కు పునకాలే

‘సలార్’ రిలీజ్ కు నెల సమయం ఉంది. ఈ క్రమంలో యూనిట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అందిస్తూనే వస్తోంది. తాజాగా మొదటిపార్ట్ రన్ టైమ్ లాక్ అయ్యింది. ఎంత నిడివి ఉందంటే..

Salaar Cease Fire Part 1 Runtime Details NSK

ఇండియాతో పాటు ఓవర్ సీస్ లోనూ  మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘సలార్ : సీజ్ ఫైర్ - పార్ట్ 1’ చిత్రానికి ఎంత డిమాండ్ ఉందో తెలిసిందే. కొద్ది రోజులుగా సినిమా డిస్ట్రిబ్యూట్ పనులను పూర్తి చేస్తున్నారు. వచ్చే నెలలో సినిమా రిలీజ్ ఉండటంతో ఇంట్రెస్టింగ్ గా అప్డేట్స్ కూడా వదులుతున్నారు.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) యూరప్ నుంచి హైదరాబాద్ కు తిరిగి వచ్చాక వరుసగా అప్డేట్స్ అందుతున్నాయి. ఇప్పటికే ట్రైలర్ కు డేట్ ఫిక్స్ చేశారు. డిసెంబర్ 1న ట్రైలర్ రిలీజ్ చేస్తున్నామని అధికారికంగా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందింది. 

‘సలార్’ రెండు భాగాలుగా రాబోతున్న విషయం తెలిసిందే. మొదటి భాగాన్నిడిసెంబర్ 22న గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఫస్ట్ పార్ట్ కు సంబంధించిన రన్ టైమ్ లాక్ అయినట్టు తెలుస్తోంది. రెండు గంటల 55 నిమిషాలు ఉంది. అంటే దాదాపు మూడు గంటలపాటు యాక్షన్ మోతతో ఫ్యాన్స్ కు ఫునకాలే అని చెప్పాలి. సరైన యాక్షన్ మూవీలో ప్రభాస్ ను చూడలనే వెయిట్ చేస్తున్న అభిమానులకు ఇంత నిడివిగల సినిమా ట్రీట్ అనే చెప్పాలి. 

ఈ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని ప్రశాంత్ నీల్ (Prashanth) డైరెక్ట్ చేస్తున్నారు. ‘కేజీఎఫ్’ మేకర్స్ హోంబలే ఫిల్మ్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మించారు. ప్రస్తుతం ప్యాచ్ వర్క్ లు, పోస్ట్ ప్రోడక్షన్ జరుగుతోంది. శృతిహాసన్ (Shruti Haasan) హీరోయిన్. మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు విలన్లుగా నటిస్తున్నారు. శ్రియా రెడ్డి, సప్తగిరి కీలక పాత్రల్లో అలరించబోతున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios