ఏజెంట్ టీమ్ సూపర్ ఫాస్ట్ గా ఉన్నారు. వరుస అప్ డేట్స్ ప్లాన్ చేస్తున్నారు. దాదాపు షూటింగ్ అంతా కంప్లీట్ చేసుకున్న టీమ్.. తరువాతి కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఇక తాజాగా ఈమూవీ నుంచి హీరోయిన్ కు సబంధించి పోస్టర్ రిలీజ్ చేశారు టీమ్. 

అక్కినేనివారి వారసుడు అఖిల్ క‌మ‌ర్షియ‌ల్ హిట్ కోసం ఎంత‌గానో ఎదురు చూస్తున్నాడు. కెరీర్ స్టార్టింగ్ నుంచి వ‌రుస ఫ్లాపుల్లో ఉన్న అఖిల్‌కు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ కాస్త ఊర‌ట‌నిచ్చింది. కానీ ఈ మూవీ అఖిల్‌కు మాత్రం క‌మ‌ర్షియ‌ల్ హిట్టును ఇవ్వ‌లేక‌పోయింది. దాంతో ఈ సారి ఎలాగైనా బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్టు కొట్టాల‌ని సురేంద‌ర్ రెడ్డితో సినిమా చేస్తున్నాడు. ప్ర‌స్తుతం వీళ్ళ కాంబోలో తెర‌కెక్కుతున్న చిత్రం ఏజెంట్‌. అఖిల్ ఈ మూవీ కోసం గట్టిగా కష్టపడుతున్నాడు. పూర్తీగా మేకోవ‌ర్ అయ్యాడు. 

అఖిల్ రా ఏజెంట్‌ గా ఈ సినిమాలో క‌నిపించ‌నున్నాడు. ఏజెంట్ మూవీలో అఖిల్‌కు జోడీగా సాక్షీ వైద్య హీరోయిన్‌గా న‌టిస్తుంది.ఇక ఆదివారం ఈమె పుట్టిన‌రోజు సంద‌ర్భంగా మేక‌ర్స్ ఫ‌స్ట్‌లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.ఈ పోస్ట‌ర్‌లో సాక్షీ రొమాంటిక్ క‌ళ్ళ‌తో చిన్న‌గా చిరున‌వ్వును ఒలికిస్తూ అద్భుతంగా ఉంది. . లేటెస్ట్‌గా విడుద‌లైన ఈ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ ప్రేక్ష‌కుల‌ను విపరీతంగా ఆక‌ట్టుకుంటుంది. మ‌ల‌యాళ స్టార్ మ‌మ్ముట్టి కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్న ఈ సినిమాపై ప్రేక్ష‌కుల‌లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. 

Scroll to load tweet…

 హీరోలను చాలా స్టైలీష్ గా చూపించడంలో సురేందర్ రెడ్డి మాస్టర్. దృవలో చరణ్, రేసుగుర్రంలో బన్నీ ఇలా యంగ్ స్టార్ ను డిఫరెంట్ గా చూపించాడు దర్శకుడు. అంతే కాదు యాక్షన్ ఎపిసోడ్స్ పై సురేందర్ రెడ్డిది ప్రత్యేకమైన ముద్ర కనిపిస్తుంది. ఇప్పుడు అఖిల్ విషయంలో కూడా అదే కనిపిస్తోంది. 

ఏకే ఎంట‌ర్టైన‌మెంట్స్ బ్యాన‌ర్‌, సుంకర రాంబ్రహ్మంతో క‌లిసి సురేంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని స్వీయ నిర్మాణంలో తెర‌కెక్కిస్తున్నాడు. ఇటీవ‌లే అఖిల్ మానాలీ షూటింగ్‌లో దిగిన ఫోటోల‌ను షేర్ చేసిన విష‌యం తెలిసిందే. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ సినిమా కోసం అఖిల్ కంప్లట్ గా మేకోవర్ అయ్యాడు. అసుల మన సిసింద్రీ ఇతనేనా అన్నట్టుగా.. అఖిల్ 8 ప్యాక్ తో.. టోన్డ్ బాడీతో డిఫరెంట్ హెయిర్ స్టైల్ తో.. హ్యాండ్సమ్ లుక్ తో అదరగొడుతన్నాడు. 

కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ సినిమాపై యంగ్ హీరో ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఈసారి సాలిడ్ హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు. దానికి తగ్గట్టే కృషి చేస్తున్నాడు. ముందుగా అగస్ట్ 12న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు టీమ్.. కాని కొన్ని కారణాల వల్ల ఈమూవీని పోస్ట్ పోన్ చేసినట్టు తెలుస్తోంది. . ఇక ఈ సినిమాను దసరాకి విడుదల చేయనున్నట్టు సమాచారం. అయితే దసరాకి గట్టి పోటీ ఉన్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోలు చాలా మంది దసరా బరిలో ఉన్నారు. అయినా సరే. ముందుగా అనుకున్న సమయానికి పనులు కాకపోవడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నారట.