సినిమా ఇండస్ట్రీ చాలా మంది నటీమణులు తాము ఎదుర్కొన్న కాస్టింగ్ కౌచ్ వ్యవహారాల గురించి బహిరంగంగా కామెంట్స్ చేశారు. హీరోయిన్ సాక్షి చౌదరి కూడా తనకు ఒక్క రాత్రి కోటి ఆఫర్ చేసిన వారు ఉన్నారని షాకింగ్ కామెంట్స్ చేసింది.
సినిమా ఇండస్ట్రీ చాలా మంది నటీమణులు తాము ఎదుర్కొన్న కాస్టింగ్ కౌచ్ వ్యవహారాల గురించి బహిరంగంగా కామెంట్స్ చేశారు. హీరోయిన్ సాక్షి చౌదరి కూడా తనకు ఒక్క రాత్రి కోటి ఆఫర్ చేసిన వారు ఉన్నారని షాకింగ్ కామెంట్స్ చేసింది. అయితే ఈ ఆమె పెట్టిన ట్వీట్ కి విపరీతమైన నెగెటివిటీ రావడంతో వెంటనే ట్వీట్ ని తొలగించింది.
అయితే అప్పటికే చాలా మంది చూడడంతో ఈ టాపిక్ కాస్త వైరల్ అయింది. సాక్షి చౌదరి గురించి తెలియని వారు కూడా ఆమె గురించి సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. ఒక్క ట్వీట్ తో బాగా వైరల్ అయింది ఈ బ్యూటీ.
ఇటీవల తన సినిమా ప్రమోషన్స్ కోసమని మీడియా ముందుకొచ్చిన ఈ నటిని ట్వీట్ ఎందుకు డిలీట్ చేశారని ప్రశ్నిస్తే సైలెంట్ గా ఉండిపోయింది. ఆ విషయం గురించి మీడియాతో మాట్లాడడానికి ఆమె ఇష్టపడలేదు. అసలు పోస్ట్ ఎందుకు పెట్టింది..? ఎందుకు తొలగించింది..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
టాలీవుడ్ లో సక్సెస్ లు లేక ఆమెని ఎవరూ పట్టించుకోవడం మానేసిన సమయంలో కావాలని ఫేమస్ అవ్వడానికి ఇలాంటి ట్వీట్ చేసిందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇదంతా తన కొత్త సినిమా ప్రమోషన్స్ కోసం చేస్తుందని విమర్శలు ఎక్కువవుతున్నాయి.
