Asianet News TeluguAsianet News Telugu

ప్రభాస్ తో రొమాన్స్ చేయనున్న పాకిస్తాన్ బ్యూటీ ?.. ఫిక్స్ అయితే ఫ్యాన్స్ కి పండగే..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి చిత్రం బాక్సాఫీస్ దద్దరిల్లే ఘనవిజయం సొంతం చేసుకుంది. ఇక ప్రభాస్ ఫోకస్ తదుపరి చిత్రాలపై మళ్లింది.

Sajal Aly to romance with Prabhas in this movie dtr
Author
First Published Jul 21, 2024, 7:43 PM IST | Last Updated Jul 21, 2024, 7:43 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి చిత్రం బాక్సాఫీస్ దద్దరిల్లే ఘనవిజయం సొంతం చేసుకుంది. ఇక ప్రభాస్ ఫోకస్ తదుపరి చిత్రాలపై మళ్లింది. ఆల్రెడీ హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే చిత్రానికి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. 

ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారీ బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కనుంది. పీరియాడిక్ డ్రామాగా హను రాఘవపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ బ్రిటీష్ ఆర్మీలో సైనికుడిగా కనిపిస్తాడట. 

ఈ చిత్రానికి ఫౌజి అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. తాజాగా మరో క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. అదేంటంటే ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పాకిస్తానీ హీరోయిన్ నటించబోతోందట. ఈ మేరకు డైరెక్టర్ హను రాఘవపూడి ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sajal Ali (@sajalaly)

శ్రీదేవి మామ్ చిత్రంలో నటించిన సాజల్ అలీ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. అయితే సాజల్ కి అంతగా బాలీవుడ్ లో అవకాశాలు రాలేదు. కానీ సోషల్ మీడియాలో ఈ యంగ్ బ్యూటీ లుక్స్ యువతని ఫిదా చేసే విధంగా ఉన్నాయి. 

ఇంత అందమైన హీరోయిన్ ప్రభాస్ సరసన నటిస్తే కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుందని ఫ్యాన్స్ అంటున్నారు. ఈ కాంబినేషన్ సెట్ కావాలని కోరుకుంటున్నారు. అయితే దీనిపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios