Asianet News TeluguAsianet News Telugu

Saina Nehwal: ఇప్పటికైనా మారినందుకు సంతోషం.. సిద్ధార్థ క్షమాపణపై సైనా స్పందన..

Saina Nehwal: భారత  ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటనలో భద్రతపై స్పందించిన బ్యాడ్మింటన్ సైనా నేహ్వాల్ ట్వీట్ పై హీరో సిద్ధార్థ రీ ట్వీట్ చేసిన  సంగతి తెలిసిందే. అయితే నెటిజన్లు, సినీ పెద్దలు,  పొలిటికల్ లీడర్ల నుంచి సిద్దార్థపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో సిద్ధూ క్షమాపణ కోరుతూ సైనాకు ట్వీట్ చేశారు. 
 

Saina Nehawal : Happy for changed of siddhartha
Author
Hyderabad, First Published Jan 12, 2022, 5:50 PM IST

హీరో సిద్ధార్థ ఇటీవల ట్విట్టర్ వేదికన వరుసగా  ట్వీట్లతో చెలరేగిపోతున్నారు. అయితే సినిమాల్లో కన్న ఎక్కువగా  సోషల్ మీడియాలోనే మెరుస్తున్నారు. ఈ క్రమంలో కొద్ది రోజుల కింద  ఇండియన్ బ్యాడ్మింటన్  సైనా నెహ్వాల్‌  పీఎం  నరేంద్ర మోదీ పంజాబ్‌ పర్యటనలో భద్రతా లోపం తలెత్తిన నేపథ్యంలో తీవ్రంగా స్పందించిన విషయం విధితమే.  

మన దేశ ప్రధాన మంత్రి  భద్రతకే ముప్పు వాటిల్లితే  దేశం సురక్షితంగా ఉందని ఎలా చెప్పుకోగలమని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.  ఈ మేరకు ఆమె ట్విట్టర్లో  చేసిన ట్వీట్‌కు  నటుడు సిద్ధార్థ అభ్యంతరకర అర్థం వచ్చేలా రీట్వీట్‌ చేశాడు. దీనిపై సిద్ధార్థకు వ్యతిరేకంగా చాలా మంది నెటిజన్లు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అంతేకాకుండా జాతీయ మహిళా కమిషన్‌ రంగంలోకి దిగి సైనాకు మద్దతుగా నిలిచింది.  సైనా తండ్రి హర్వీర్‌ సింగ్‌, భర్త పారుపల్లి కశ్యప్‌ కూడా సిద్ధార్థ తీరును ఖండించారు. సిద్ధార్థ తీరు మార్చుకోవాలని సూచించారు. కాగా  సైనా నేహ్వాల్ పేరు  ట్విట్టర్‌లో ఆసక్తిగా మారింది.  పొలిటికల్ లీడర్స్, సినీ ప్రముఖులు కూడా సి ద్ధార్థపై ఘాటుగా విమర్శల  వర్షం కురిపించారు.  

దీంతో సిద్దార్థ సైనా నెహ్వాల్ కు క్షమాపణ చెప్పక తప్పలేదు.  సైనా ట్వీట్ పట్ల  తన  వ్యంగ హాస్యానికి క్షమాపణ కోరుతున్నానని తెలిపాడు సద్దార్థ. ఇందుకు సైనా నెహ్వాల్ స్పందించారు.  ఇప్పటికైనా సిద్దార్థ తన తప్పు తెలుసుకుని క్షమాపణ కోరడం సంతోషకరంగా  ఉందని తెలిపింది. అయితే ఒక మహిళ పట్ల అసభ్యకర వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవుు పలికారు.  ఆ దేవుడు సిద్దార్థను చల్లగా చూడాలని టైమ్స్ నౌ వేదికన ఆకాంక్షించారు. గతంలోనూ సిద్ధార్థ సమంత‌, నాగచైతన్య, ఇతరులపై ట్వీట్ చేసి వార్తల్లో నిలిచారు. 

 

అయితే సిద్ధార్థ సైనాకు క్షమాపణ చెప్పడాన్ని పలువురు ట్విట్టర్ ఖాతాదారులు స్వాగతిస్తున్నారు. అయితే సైనాకు సిద్దార్థ చేసిన ట్వీట్లో ఏముందో  తెలియదంట.  ఆ ట్వీట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవడంతో అసలు విషయం తెలిసిందంటోంది.  ఇప్పటికైనా  క్షమాపణ కోరి తన హుందాతనాన్ని కాపాడుకున్నాడని అంది. ఇటీవల  అంతర్జాతీయ టోర్నీలతో పాటు లండన్‌ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన సైనాను ప్రభుత్వం పద్మభూషణ్ తో సత్కరించిన విషయం తెలిసిందే. 
 

Follow Us:
Download App:
  • android
  • ios