ప్రధానమంత్రి నరేంద్రమోడీ 70వ పుట్టిన రోజు వేడుకని గురువారం ఘనంగా జరుపుకున్నారు.  ఛాయ్‌ వాలా నుంచి దేశ ప్రధాని స్థానానికి మోడీ ఎదిగిన వైనం మనందరికే కాదు ప్రపంచానికే ఆదర్శం. పుట్టిన రోజుని పురస్కరించుకుని మోడీకి దేశ వ్యాప్తంగా బర్త్ డే విశెష్‌ వెల్లువల వస్తున్నాయి. సెలబ్రిటీలు సైతం బర్త్ డే విశెష్‌ తెలిపారు. అయితే అందులో విలక్షణ నటుడు సాయికుమార్‌ మాత్రం తన ప్రత్యేకతని చాటుకున్నారు. ఓ ప్రత్యేక వీడియో ద్వారా మోడీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా మోడీ ఘన కీర్తిని కొనియాడారు. ఆ శ్రీరాముడి ఆశీస్సులతో, రామరాజ్యం స్థాపనకై దీక్షభూనిన ఒకే ఒక్కరు.. క్యాలిబర్‌, కెపాసిటి, విజన్‌ ఉన్న అన్‌ కరెప్టెడ్‌ లీడర్‌ నరేంద్రమోడీగారికి జన్మదిన శుభాకాంక్షలు
అంటూ.. `ఇంద్రలోకానికి దేవేంద్రుడు.. నాగలోకానికి నాగేంద్రుడు.. మనకు నరేంద్రుడు` అని ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ వీడియోకి విశేష స్పందన లభిస్తుంది.