బాలీవుడ్ ముద్దుగుమ్మ కరీనాకపూర్ పెళ్లి తరువాత కూడా తన ఫిజిక్ ని చక్కగా మైంటైన్ చేస్తూ కసరత్తుల విషయంలో గోల్స్ సెట్ చేస్తోంది. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే సైఫ్ అలీఖాన్ ని పెళ్లి చేసుకున్న కరీనా తైమూర్ అలీఖాన్ కి జన్మనిచ్చింది. కొడుకు పుట్టిన తరువాత కాస్త లావు అయిందనే కామెంట్స్ వినిపించాయి.

దీంతో అతి తక్కువ సమయంలో బరువు తగ్గించుకొని స్లిమ్ గా మారిపోయింది. జిమ్ లోనే ఎక్కువ సమయం గడిపే కరీనాను బాలీవుడ్ లో జిమ్ హాలిక్ అంటుంటారు. తాజాగా కరీనా కపూర్ జిమ్ బాడీ గురించి సైఫ్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఇటీవల ఓ టాక్ షోలో పాల్గొన్న సైఫ్ అలీఖాన్ కి కరీనా వర్కవుట్స్ కి సంబంధించిన ప్రశ్న ఎదురైంది.

కరీనా కపూర్ జిమ్ లుక్ ని బాగా పాపులర్ చేసింది కదా..? అని ప్రశ్నించగా దానికి సమాధానంగా సైఫ్ అలీ ఖాన్.. ఆమె జిమ్ లుక్ ను అందరూ ఒకలా చూస్తే తాను మాత్రం బెడ్ రూమ్ లో క్లోజప్ లుక్ లో  వీక్షిస్తానంటూ హాట్ కామెంట్స్ చేశాడు. సైఫ్ ఇలాంటి బోల్డ్ కామెంట్స్ చేస్తోన్న సమయంలో అతడు మొదటి భార్య కూతురు సారా అలీఖాన్ కూడా అక్కడే ఉంది.

దీంతో సోషల్ మీడియాలో సైఫ్ పై విమర్శలు మొదలయ్యాయి. కూతురి ముందు ఇలాంటి మాటలు మాట్లాడడానికి సిగ్గుగా లేదా..? అంటూ సైఫ్ పై మండిపడుతున్నారు. భార్య, భర్తలకు సంబంధించిన వ్యక్తిగత విషయాలపై ఇలా పబ్లిక్ గా కామెంట్ చేయడం కరెక్టా..? అంటూ సైఫ్ ని ప్రశ్నిస్తున్నారు.