ఇండియా, పాక్ మధ్య ఆదివారం ప్రపంచ కప్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా చిరస్మరణీయ విజయం సాధించింది. ఆటగాళ్ళని ఉత్సాహపరిచేందుకు స్టేడియం నిండుగా అభిమానులు హాజరయ్యారు. సినీ తారలు కూడా మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో సందడి చేశారు. 

రణవీర్ సింగ్, సైఫ్ అలీ ఖాన్, మంచు లక్ష్మి, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి సెలెబ్రిటీలంతా స్టేడియంలో కనిపించారు. సైఫ్ అలీఖాన్ తన తదుపరి చిత్ర షూటింగ్ లో భాగంగా ప్రస్తుతం ఇంగ్లాండ్ లోనే ఉన్నారు. సైఫ్ అలీ ఖాన్ ప్రస్తుతం జవానీ జానేమన్ చిత్రంలో నటిస్తున్నాడు. 

సైఫ్ అలీఖాన్ తన సహ నటి అలియా ఫర్నిచర్వాలాతో కలసి మైదానంలో సందడి చేస్తూ కనిపించాడు. సైఫ్ మరో ఫోటో కూడా ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. ధోని ముద్దుల కుమార్తె జీవాతో కలసి సైఫ్ దిగిన ఫోటో నెటిజన్ల హృదయాలు కొల్లగొడుతోంది. ఈ ఫొటోలో జీవా క్యూట్ లుక్స్ ఆకట్టుకుంటున్నాయి.