ఎక్కువగా ముంబాయి ముద్దుగుమ్మలే తెలుగులో సందడి చేస్తుంటారు. ఇప్పుడు అల్లు అర్జున్‌ చిత్రంలో బాలీవుడ్‌ భామని తీసుకురాబోతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో బన్నీ ఓ సినిమాలో నటించనున్నారు. ఈ చిత్రంలో సల్మాన్‌ తో రొమాన్స్ చేసిన హీరోయిన్‌ని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. 

పాన్‌ ఇండియా సినిమాల ట్రెండ్‌ ఊపందుకోవడంతో ఇప్పుడు భాషా బేధం లేకుండా నటీనటులను తీసుకుంటున్నారు. ఇక హీరోయిన్ల విషయంలో ఆ తేడా ఎప్పుడూ లేదు. ఎక్కువగా ముంబాయి ముద్దుగుమ్మలే తెలుగులో సందడి చేస్తుంటారు. ఇప్పుడు అల్లు అర్జున్‌ చిత్రంలో బాలీవుడ్‌ భామని తీసుకురాబోతున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో బన్నీ ఓ సినిమాలో నటించనున్నారు. ఈ చిత్రంలో సల్మాన్‌ తో రొమాన్స్ చేసిన హీరోయిన్‌ని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. 

ప్రస్తుతం అల్లుఅర్జున్‌.. సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న `పుష్ప` చిత్రంలో నటిస్తున్నారు. రష్మిక మందన్నాహీరోయిన్‌. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. అనంతరం కొరటాల శివ డైరెక్షన్‌లో ఓ సినిమా చేయనున్నారు బన్నీ. ఇందులో హీరోయిన్‌ పాత్ర కోసం సయీ మంజ్రేకర్‌ని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. ఈ సినిమాని కూడా పాన్‌ ఇండియా చిత్రంగా రూపొందించబోతున్నారని, అందు కోసమే బాలీవుడ్‌ భామని లైన్‌లో పెట్టారని టాక్‌. అయితే ఇప్పటికే సయీ మంజ్రేకర్‌ తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ అడవి శేషుసరసన `మేజర్‌` చిత్రంలో నటిస్తుంది. ఇప్పుడు బన్నీతోనూ ఆడిపాడబోతుందని చెప్పొచ్చు. సల్మాన్‌తో ఈ అమ్ముడు `దబాంగ్‌3`లో నటించింది. 

ఇక ప్రస్తుతం బన్నీ నటిస్తున్న `పుష్ప` చిత్రం ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో సాగుతుంది. ఇందులో పుష్పరాజ్‌ పాత్రలో కనిపించనున్నాడు. ఆయన అన్యాయంగా ఎర్రచందనం స్మిగ్లింగ్‌లో ఇరుక్కుంటాడని, దాన్నుంచి బయటపడేందుకు, అందుకు కారకులపై ప్రతీకారం తీసుకోవడం ప్రధానంగా ఈ సినిమా సాగుతుందని టాక్‌. ఇందులో బన్నీ పాత్ర చాలా మాస్‌గా ఉంటుందని తెలుస్తుంది. ఇప్పటికే విడుదలైన లుక్‌లు ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.