సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం 'ప్రతిరోజూ పండగే'. వినోదాత్మక చిత్రాల దర్శకుడు మారుతి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రతిరోజూ పండగే చిత్రం ప్రేక్షుకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ చిత్ర టైటిల్ ని చిత్ర యూనిట్ ప్రకటించింది. 

తాజాగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ చూడగానే ఆకట్టుకునే విధంగా ఉంది. ప్రముఖ నటుడు సత్యరాజ్ , సాయిధరమ్ తేజ్ వర్షంలో తడుస్తూ ఎంజాయ్ చేస్తున్న లుక్ సినిమాపై మంచి అనుభూతి కలిగించే విధంగా ఉంది. 

తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. యువి క్రియేషన్స్, గీత ఆర్ట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సుప్రీం తర్వాత రాశి ఖన్నా మరోసారి సాయిధరమ్ తేజ్ తో రొమాన్స్ చేస్తోంది. డిసెంబర్ లో ప్రతిరోజూ పండగే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ క్రింద వీడియోలో మోషన్ పోస్టర్ చూడొచ్చు.