'ప్రస్థానం', 'ఆటోనగర్‌ సూర్య' సినిమాలతో అందరి దృష్టినీ ఆకర్షించిన దేవా కట్ట రిపబ్లిక్‌కు దర్శకుడిగా వ్యవహరించాడు. ఇందులో సీనియర్‌ నటి రమ్యకృష్ణ పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించనుండగా ఐశ్వర్యా రాజేష్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. 


ఇన్నాళ్ళూ ఓటీటీ వైపు మొగ్గు చూపుతున్న సినిమాల లిస్టులో సాయిధరమ్‌ తేజ్‌ 'రిపబ్లిక్‌' సినిమా కూడా ఉంది. అయితే ఇప్పుడు థియోటర్స్ మళ్లీ తెరుచుకోవటంతో సినిమా రిలీజ్ ని ఓటీటి వద్దనుకున్నారు. పంద్రాగస్టు సందర్భంగా ఈ మూవీ రిలీజ్ డేట్‌ను చిత్ర టీమ్ ప్రకటించింది.‘రిపబ్లిక్’ మూవీ అక్టోబర్ 2న గాంధీ జయంతిని పురస్కరించుకుని ఒక రోజు ముందు అంటే.. అక్టోబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు తెలిపారు. షెడ్యూల్ ప్రకారం ఈ మూవీ జూన్ 4న విడుదల కావాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది.

'ప్రస్థానం', 'ఆటోనగర్‌ సూర్య' సినిమాలతో అందరి దృష్టినీ ఆకర్షించిన దేవా కట్ట రిపబ్లిక్‌కు దర్శకుడిగా వ్యవహరించాడు. ఇందులో సీనియర్‌ నటి రమ్యకృష్ణ పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించనుండగా ఐశ్వర్యా రాజేష్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం జూన్‌ 4న రిలీజ్‌ చేయాలనుకున్నారు, కానీ కరోనా కారణంగా రిలీజ్‌ వాయిదా వేశారు. అయితే కొన్ని ఓటీటీ సంస్థలు మంచి ఆఫర్‌ను అందిస్తుండటంతో వాటితో డీల్‌ కుదుర్చుకునే దిశగా చర్చలు నడిచాయి.కానీ అవన్నీ ప్రక్కన పెట్టేసి థియోటర్ వైపే ప్రయాణం పెట్టుకున్నారు. ఈ మేరకు రిపబ్లిక్ రిలీజ్ డేట్ ని ఖరారు చేస్తూ అధికారిక ప్రకటన వచ్చేసింది!

‘రిపబ్లిక్’ మూవీకి ‘ప్రస్థానం’ ఫేం దేవ్ కట్టా దర్శకత్వం వహిస్తున్నాడు. భారత రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వ ఉద్యోగులు, కోర్టుల నేపథ్యంలో ఈ మూవీని దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఇందులో పంజా అభిరామ్ అనే ఐఏఎస్ ఆఫీసర్ పాత్రను సాయితేజ్ పోషిస్తున్నాడు. విశేషం ఏమంటే తన ఇంటిపేరును తొలిసారి సాయితేజ్ తన పాత్రకు పెట్టుకున్నాడు. ఇంతవరకూ తాను పోషించిన పాత్రలలో పంజా అభిరామ్ అత్యంత ఇష్టమైనదని తేజ్ చెబుతున్నాడు. ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో జగపతిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.