హీరోయిన్ మెహ్రీన్ తో కలిసి పనిచేయడానికి మెగాహీరో సాయి తేజ్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. మారుతి దర్శకుడిగా వ్యవహరిస్తోన్న తన కొత్త సినిమాలో 
హీరోయిన్ గా మెహ్రీన్ ని తీసుకోవాలని డైరెక్టర్ ప్రపోజల్ పెడితే దానికి సాయి తేజ్ నో చెప్పాడట.

ఆమె కాకుండా ఏ హీరోయిన్ అయినా పరవాలేదని అన్నాడట. మరి మెహ్రీన్ కి సాయి తేజ్ కి ఉన్న సమస్య ఏంటనేది మాత్రం తెలియడం లేదు. వీరిద్దరూ కలిసి గతంలో 'జవాన్' సినిమాలో నటించారు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. 

ఇక మెహ్రీన్ విషయానికొస్తే.. ఇటీవల 'ఎఫ్ 2' సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది. సాయి తేజ్ తో పోలిస్తే మెహ్రీన్ హిట్ ట్రాక్ లో ఉంది. అలాంటిది ఆమెని మాత్రం హీరోయిన్ గా తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు సాయి తేజ్. దర్శకుడు మారుతి గతంలో మెహ్రీన్ తో కలిసి 'మహానుభావుడు' సినిమాకి వర్క్ చేశాడు.

ఆ సాన్నిహిత్యంతోనే ఆమెని హీరోయిన్ గా తీసుకోవాలని భావించారు. కానీ సాయి తేజ్ ఒప్పుకోకపోవడంతో మరో యంగ్ బ్యూటీ రుక్సార్ ని రంగంలోకి దింపారు. ఈమె 'కృష్ణార్జున యుద్ధం', 'ఏబిసిడి' వంటి చిత్రాల్లో నటించింది. అల్లు అరవింద్ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని ఏడెనిమిది కోట్లలో పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు.