సాయిపల్లవి `ఫిదా` తర్వాత టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణిస్తుంది. తెలుగులో ఈ అమ్మడు ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తుంది. ఇందులో నాగచైతన్యతో కలిసి `లవ్‌స్టోరి`లో నటిస్తుండగా, మరోవైపు రానాతో కలిసి `విరాటపర్వం` చేస్తుంది. ఇందులో ఆమె నక్సలైట్‌ అయిన రానాకి ప్రియురాలిగా, నక్సలైట్‌ సానుభూతి పరురాలుగా కనిపించనుంది. మరోవైపు నానితో కలిసి మరోసారి `శ్యామ్‌ సింగరాయ్‌`లో నటిస్తుంది. ఇప్పటికే `ఎంసీఏ`లో నటించిన విషయం తెలిసిందే. 

మరోవైపు పవన్‌-రానా హీరోలుగా రూపొందుతున్న `అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌` చిత్రంలో హీరోయిన్‌గా, రానాకి జోడిగా కనిపించనుందని టాక్‌ వినిపిస్తుంది. సాయిపల్లవికి సంబంధించిన తాజాగా మరో ఆసక్తికర వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. హాస్య నటుడి బుట్టలో పడబోతుందని అంటున్నారు. తమిళ హాస్య నటుడు కాళీ వెంకట్‌ హీరోగా రూపొందుతున్న ఓ సినిమాలో హీరోయిన్‌గా సాయి పల్లవి పేరు వినిపిస్తుంది. అయితే దీనిపై ఈ `ఫిదా` బ్యూటీ ఇంకా క్లారిటీ ఇవ్వలేదని తెలుస్తుంది. ఈ సినిమాకి ఒప్పుకుంటే సాయిపల్లవి ఓ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందనే చెప్పాలి.  కాళీ ఇటీవల సూర్య `ఆకాశమే నీ హద్దురా`, `మారి2` వంటి చిత్రాల్లో నటించారు.