సాయి పల్లవి చాలా ప్రత్యేకం. హీరోయిన్స్ లో ఆమె విభిన్నం అని చెప్పాలి. ఆమె చర్యలు, పద్ధతులు సాయి పల్లవిని మిగతా హీరోయిన్స్ కంటే స్పెషల్ గా మార్చేశాయి. తాజాగా సాయి పల్లవి చేసిన పని వార్తలకెక్కింది.  

మహేష్ బాబు (Mahesh Babu) లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట. భారీ కలెక్షన్స్ సాధిస్తున్న ఈ చిత్రం సామాజిక సందేశంతో తెరకెక్కింది. దేశంలో జరుగుతున్న ఆర్ధిక నేరాలు, వాటి వలన పేద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రధానంగా దర్శకుడు పరశురామ్ సర్కారు వారి పాట చిత్రాన్ని తెరకెక్కించారు. మహేష్ మూవీకి సర్వత్రా ప్రశంసలు దక్కుతుండగా... సాయి పల్లవి ఈ మూవీ ఓ సాధారణ ఆడియన్స్ లా ఫ్యాన్స్ తో పాటు వీక్షించారు. మారు వేషంలో సాయి పల్లవి హైదరాబాద్ లో సర్కారు వారి పాట మూవీ చూశారు. 

సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) మూవీ చేసేందుకు సాయిపల్లవి ముసుగేసుకుని థియేటర్‌కు వెళ్లింది. హైదరాబాద్ పీవీఆర్‌ ఆర్‌కే సినీప్లెక్స్‌లో మహేశ్‌ మూవీ చూసి ఎంజాయ్‌ చేసింది.ఈ క్రమంలో తననెవరూ గుర్తుపట్టకుండా స్కార్ఫ్‌తో తన ముఖాన్ని కప్పుకుంది. సినిమా అయిపోయిన తర్వాత కూడా ముఖానికి మాస్క్‌ ధరించి ఎవరికీ కనబడకుండా జాగ్రత్తపడుతూ ఫోన్‌లో మాట్లుడుతూ వడివడిగా నడుచుకుంటూ థియేటర్‌ నుంచి బయటకు వచ్చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన ఫ్యాన్స్‌ ఆమె సింప్లిసిటీకి ముచ్చటపడుతున్నారు. 

Scroll to load tweet…

గతంలో కూడా సాయి పల్లవి (Sai Pallavi)ఇలాంటి సాహసాలు చేయడం విశేషం. ఆమె లేటెస్ట్ మూవీ శ్యామ్ సింగరాయ్ చిత్రాన్ని ఆమె మారు వేషంలో ప్రేక్షకులతో పాటు చూశారు. బుర్కా ధరించి థియేటర్ కి వచ్చిన సాయి పల్లవిని మూవీ ముగించుకొని వెళ్లబోయే ముందు అక్కడున్న జనాలు గుర్తించారు. అప్పుడు వాళ్లందరినీ పలకరిస్తూ కారులో వెళ్ళిపోయింది. సాధారణంగా సెలెబ్రిటీలు పబ్లిక్ లోకి ఒంటరిగా రావడానికి ఇష్టపడరు. అభిమానులు తాకిడికి భయపడి బాడీ గార్డ్స్ లేకుండా బయటికొచ్చే సహాయం చేయరు. సాయి పల్లవి మాత్రం ఇలా మారువేషంలో తనకు నచ్చిన సినిమాలు చూస్తూ తన ప్రత్యేకత చాటుకుంటుంది . 

ఇక సాయి పల్లవి నటించిన విరాటపర్వం విడుదలకు సిద్ధమైంది. చాలా కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో రానా హీరోగా నటిస్తున్నారు. వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తుండగా... ప్రియమణి కీలక రోల్ చేస్తున్నారు. అలాగే గార్గి పేరుతో మల్టీ లింగ్వల్ మూవీ సాయి పల్లవి చేస్తున్నారు.