తెలుగులో పడి పడి లేచే మనసు - తమిళ్ లో మారి 2 డిజాస్టర్ అవ్వడంతో సాయి పల్లవి మార్కెట్ ఒక్కసారిగా పడిపోయింది అనే టాక్ గట్టిగానే వచ్చింది. అవకాశాలు తగ్గడమే కాకుండా రెమ్యునరేషన్ కూడా చాలా వరకు తగ్గించేశారు అని కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ తరుణంలో రౌడీ బేబీకి ఊహించని విధంగా ఆఫర్స్ వస్తున్నాయట. 

కోలీవుడ్ లో ఒక బడా నిర్మాత సాయి పల్లవితో లేడి ఓరియెంటెడ్ సినిమాను తెరకెక్కించే అవకాశం ఉందని సమాచారం. ఎందుకంటే జస్ట్ అలా అలా స్టెప్పులేసినందుకే రౌడీ బేబీ సాంగ్ ఓ రేంజ్ లో హిట్టయింది. మూడు వందల పద్నాలుగు మిలియన్ వ్యూవ్స్ ని అందుకొని కొత్త రికార్డ్ ను అందుకుంది. సాయి పల్లవి డ్యాన్స్ వల్ల సినిమా పాటకే అందమొచ్చింది. 

డిజాస్టర్ సినిమా అయినా అందులో పాట వల్ల అమ్మడికి అనుకున్నదానికంటే ఎక్కువ క్రేజే వచ్చింది. దీంతో ఇప్పుడు లేడి ఓరియెంటెడ్ కథలు కూడా వస్తున్నాయ్. మెయిన్ గా డ్యాన్స్ బ్యాక్ డ్రాప్ లో సాయి పల్లవి టాలెంట్ మొత్తం తెరపై చూపించేలా ఒక కథను సెట్ చేయమని రచయితలకు నిర్మాతలు అఫర్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఆ ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.