తన ఫేవరైట్ హీరో సరసన ఛాన్స్ కొట్టేసిన ఫిదా బ్యూటీ సాయిపల్లవి

First Published 21, Dec 2017, 12:51 AM IST
sai pallavi to act with her favourite hero surya
Highlights
  • ఫిదా మూవీతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన మళయాల బ్యూటీ సాయిపల్లవి
  • తాజాగా నాని సరసన ఎంసిఎ సినిమాలో హిరోయిన్గా నటించిన సాయిపల్లవి
  • తన ఫేవరైట్ హీరో సూర్య సరసన ఛాన్స్ కొట్టేసిన ఫిదా బ్యూటీ

ఫిదా మూవీతో తెలుగు అమ్మాయిలకు ఇనిస్పిరేషన్ గా... కుర్రాళ్లకు హార్ట్ త్రోబ్ గా మారిన నటి సాయి పల్లవి. తనకు తమిళస్టార్‌ సూర్య అంటే తనకు చాలా ఇష్టమని.. ఆయన్ను కలిస్తే ఐ లవ్‌ యూ చెప్తానని ‘ఫిదా’ భామ సాయిపల్లవి గతంలో చాలాసార్లు అంది.

 

ఆయన పట్ల వున్న అభిమానం వల్లనో, మరోలానో మొత్తానికి ఫిదా బ్యూటీని ఆయన సరసన నటించే లక్కీ ఛాన్స్‌ వరించింది. సూర్య తర్వాతి చిత్రంలో సాయిపల్లవిని కథానాయికగా తీసుకున్నట్లు సూర్య తదుపరి చిత్ర నిర్మాతలు బుధవారం ప్రకటించారు. తమ బృందంలోకి ఆమెకు స్వాగతం చెప్పారు. కాగా సూర్యతో నటించే అవకాశం కల్పించినందుకు సాయిపల్లవి ధన్యవాదాలు తెలిపింది. తమిళంలో సాయిపల్లవి నటించిన తొలి చిత్రం ‘కరు’ కాగా (తెలుగులో ‘కణం’).  రెండో చిత్రం ధనుష్‌ సరసన నటిస్తున్న ‘మారి 2’. ఇప్పుడు ఆమె మూడో ప్రాజెక్టుగా సూర్య 36వ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది.

 

సాయిపల్లవి 2015లో ‘ప్రేమమ్‌’ అనే మలయాళ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది ఆమె నటించిన ‘కాలి’ సినిమా సక్సెస్ సాధించింది. ఈ ఏడాది ‘ఫిదా’తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. సాయిపల్లవి, నానితో కలిసి నటించిన ‘ఎంసీఏ’ సినిమా ఇవాళే విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. కాగా సాయిపల్లవి తాజాగా తన అభిమాన హీరో సూర్య సరసన ఛాన్స్ కొట్టేసింది.

 

సూర్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రాన్ని డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌.ఆర్‌. ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈమూవీకి సెల్వరాఘవన్‌ దర్శకత్వం వహించనున్నారు. కథానాయికల పాత్రలను బలంగా తీర్చిదిద్దే సెల్వరాఘవన్.. ఈ మూవీలో సాయిపల్లవిని ఎలా చూపించబోతున్నారో చూడాలి.

 

loader