`సారంగ దరియా` ప్రస్తుతం యూట్యూబ్‌ని షేక్‌ చేస్తున్న సాంగ్‌. అత్యంత వేగంగా మిలియన్స్ వ్యూస్‌తో దూసుకుపోతున్న సాంగ్‌. తెలంగాణ జానపద పాట సినిమా పాటగా మారడంతో ఓ ఊపు ఊపు ఊపేస్తుంది. ఊహించని విధంగా భారీ వ్యూస్‌తో దూసుకుపోతుంది. నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్‌ కమ్ముల రూపొందించిన `లవ్‌స్టోరీ` చిత్రంలోని పాట ఇది. విశేషంగా ఆకట్టుకుంటుంది. అర్థవంతమైన అర్థంతో కూడిన ఈ జానపద పాట వివాదాలను అధిగమించుకుని వైరల్‌ అవ్వడం, సరికొత్త రికార్డులను క్రియేట్‌ చేయడం విశేషం. 

అయితే ఇది మరోసంచలనం క్రియేట్‌ చేసింది. అత్యంత వేగంగా వంద మిలియన్స్ వ్యూస్‌ని దక్కించుకున్న మొదటి తెలుగు పాటగా నిలిచింది. ఇంత వేగంగా ఈ రికార్డ్ ని క్రియేట్‌ చేయడం విశేషం. లిరికల్‌ సాంగ్‌ విభాగంలో విడుదల చేసిన నెల రోజుల్లోనే వంద మిలియన్స్‌ వ్యూస్‌ని పొందిన తొలి సాంగ్‌గా నిలిచింది. గతంలో అల్లు అర్జున్‌ నటించిన `అల వైకుంఠపురములో` చిత్రంలోని పాటల రికార్డ్ లను బ్రేక్‌ చేసింది. ఇంకా చెప్పాలంటే గతంలో ఉన్న అన్ని రికార్డులను ఇది తిరగరాసింది. సరికొత్త సంచలనం క్రియేట్‌ చేసింది. బన్నీ, త్రివిక్రమ్‌, థమన్‌లకు మైండ్‌ బ్లాంక్‌ చేసింది.

ఇక ఈ పాటని మంగ్లీ పాడగా, పవన్‌ సీహెచ్‌ సంగీతం అందించారు. ఈ పాటలో సాయిపల్లవి నర్తించడం స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. దీనికి శేఖర్‌ మాస్టర్‌ స్టెప్పులు తోడయ్యాయి. మరి ఇది మున్ముందు ఇంకెన్ని రికార్డ్ లు సృష్టిస్తుందో చూడాలి. ఇక `లవ్‌స్టోరీ` సినిమా ఈ నెల 16న విడుదల కానుంది.