సినీ ప్రముఖుల పెళ్లిపై రూమర్స్ ఎప్పటికి వచ్చేవే.. వాటిపై ఎంత క్లారిటీ ఇచ్చినా అవి విరుగుడు లేని వైరస్ లో స్ప్రెడ్ అవుతుంటాయి. అందుకే సినీ తారలు కూడా వాటి డోస్ ఎంత పెరిగినా పట్టించుకోరు. అయితే సాయి పల్లవి ఆ విషయంపై మాత్రం నిత్యం ఎదో ఒక క్లారిటీ ఇస్తూ వస్తోంది. 

కానీ రీసెంట్ గా ఈ మలయాళీ కుట్టి అసలు పెళ్లే చేసుకోనని చెప్పేసింది. రూమర్స్ పై చిరాకుతో ఈ మాట అనేసిందా.. అని అనుకుంటే అది పొరపాటే.. ఎందుకంటే అమ్మడు సైలెంట్ గా ఫ్యామిలీపై ఎమోషనల్ గా మాట్లాడుతూ ఓ వివరణ అయితే ఇచ్చింది. 

తాను పెళ్లి చేసుకుంటే ఇంట్లో అమ్మా నాన్నల్ని ఎవరు చూసుకుంటారు? అందుకే తల్లిదండ్రుల కోసం అలోచించి పెళ్లి అనే విషయాన్నీ పక్కన పెట్టినట్లు ఈ ఫిదా పిల్ల మీడియాకు సమాధానమిచ్చింది. ఇంతకుముందు ఎక్కడికెళ్లినా పెళ్లి గురించి ప్రశ్నలు ఎదుర్కొన్న సాయి పల్లవి పెద్దగా ఆ విషయాన్నీ పట్టించుకునేది కాదు. అందుకే మరోసారి ఎవరు ఆ ప్రశ్నను అడగకుండా ఈ విధంగా కౌంటర్ ఇచ్చినట్లు టాక్.