Asianet News TeluguAsianet News Telugu

సాయి పల్లవి...6 నెలలు,3 సినిమాలు

సాయి పల్లవి తెలుగులో వరుస సినిమాలు చేస్తుంది. ఎంతలా తెలుగు తెరని ఆక్యుపై చేసిందంటే రాబోయే ఆరు నెలల్లో..మూడు సినిమాలు రిలీజ్ కు ఉన్నాయి.అవేమిటంటే...
 

Sai Pallavi s three Films In six Months jsp
Author
Hyderabad, First Published Jun 11, 2021, 8:58 AM IST

చూడచక్కని రూపం, ఆకట్టుకునే అభినయం సాయి పల్లవి సొంతం. ఎంతో సింపుల్ గా…స్కిన్ షో  దూరంగా సినిమాలు చేస్తూ అలరించటమే సాయి పల్లవి ప్లస్ పాయింట్. తమిళ దర్శకుడు అల్ఫోన్సో తెరకెక్కించిన 'ప్రేమమ్' చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ వయ్యారి భామ. ఈ సినిమా సూపర్‌ హిట్‌ అయింది. ఆ తర్వాత తెలుగులో సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెలుగులో ‘ఫిదా’ సినిమా చేసింది. ఇందులో అచ్చం తెలుగింటి అమ్మాయిలా కనిపించి ఆకట్టుకుంది పల్లవి. ఈ సినిమాలో సాయిపల్లవి తెలంగాణ యాసలో మాట్లాడుతూ ప్రేక్షకులను ఫిదా చేసింది.అక్కడ నుంచి సాయి పల్లవి తెలుగులో వరుస సినిమాలు చేస్తుంది. ఎంతలా తెలుగు తెరని ఆక్యుపై చేసిందంటే రాబోయే ఆరు నెలల్లో..మూడు సినిమాలు రిలీజ్ కు ఉన్నాయి.అవేమిటంటే...

 ప్రస్తుతం ఈ కుర్రది నటించిన లవ్ స్టోరీ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. నాగచైతన్య ఈ సినిమా హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా అందమైన ప్రేమకథగా తెరకెక్కిస్తున్నాడు శేఖర్ కమ్ముల. కొద్దిగా పరిస్దితులు కుదుట పడగానే రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

అలాగే ఈ సినిమాతోపాటు వేణు ఉడుగుల దర్శకత్వంలో విరాటపర్వం అనే సినిమా చేస్తుంది సాయిపల్లవి. ఈ సినిమాలో దగ్గుబాటి వారసుడు రానా హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా నక్సలైట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది. రానా నక్సలైట్ గా కనిపించనున్నాడు. అలాగే నాని సినిమాలో కూడా నటిస్తుంది పల్లవి.  ఈ సినిమా సెప్టెంబర్ లో రానుంది.

నాని నటిస్తున్న శ్యామ్ సింగరాయ్  సినిమా హీరోయిన్ గా నటిస్తుంది సాయిపల్లవి. పిరియాడికల్ లవ్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాని డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు. ఈ సినిమాలో సాయిపల్లవి తోపాటు, ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి, అదితిరావు హైదరి నటిస్తున్నారు. ఇప్పటికే సాయి పల్లవి పుట్టిన రోజు కానుకగా శ్యామ్ సింగరాయ్ నుంచి ఈ ముద్దుగుమ్మ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఈ సినిమా డిసెంబర్ లోగా రిలీజ్ ఉంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios