దిల్ రాజుతో సాయిపల్లవి వైరం.. ఆఫర్ రిజెక్ట్

దిల్ రాజుతో సాయిపల్లవి వైరం.. ఆఫర్ రిజెక్ట్

‘ఫిదా’ సినిమా ఆఫర్ ఇచ్చిన సమయంలో.. సాయి పల్లవితో నిర్మాత దిల్ రాజు ఫిదాతోపాటు మరో రెండు సినిమాలు తన నిర్మాణ సంస్థకు చేయాలని ముందుగానే ఎగ్రిమెంట్ చేసుకున్నట్లు టాక్ వుంది. ‘ఫిదా’ బ్లాక్ బస్టర్ హిట్ అయిన తరువాత సాయి పల్లవి రేంజ్ విపరీతంగా పెరిగిపోయినా... గతంలో ఆమె దిల్ రాజ్ నిర్మాణ సంస్థకు అంగీకరించిన తక్కువ పారితోషికానికే సినిమాలు చేయవలసి రావడం సాయి పల్లవికి కొంత అసహనంగా మారిందన్న గాసిప్పులు కూడా వచ్చాయి.

 

ఈ అసహనం వల్లనే సాయి పల్లవి దిల్ రాజ్ నిర్మాణ సంస్థలో హీరో నానీతో చేస్తున్న ‘ఎంసిఏ’ షూటింగ్ సమయంలో ఆ మూవీ షూటింగ్ కు కావాలని ఆలస్యంగా వచ్చి తన అసహనాన్ని ఇన్ డైరెక్ట్ గా తెలియపరిచింది అన్న గాసిప్పులు కూడా వచ్చాయి. అయితే ఆతరువాత ఆ గాసిప్పులను ఖండించారు.

 

ఇలాంటి పరిస్థితుల్లో సాయి పల్లవి మరొకసారి తన మాటలతో దిల్ రాజ్ కు చుక్కలు చూపించింది అన్న గాసిప్పుల హడావిడి మళ్ళీ మొదలైంది. ఆసక్తికరమైన ఈన్యూస్ వివరాలలోకి వెళ్ళితే దిల్ రాజ్ నితిన్ హీరోగా సతీష్ వేగ్నేష్ దర్సకత్వంలో తీయబోతున్న మరొక సినిమాకు కూడ సాయి పల్లవిని హీరోయిన్ గా అడిగినట్లు తెలుస్తోంది.

అయితే ఊహించని విధంగా సాయి పల్లవి తనకు సతీష్ వేగ్నేష్ చెప్పిన కథకాని అందులోని తన పాత్ర కానీ తనకు ఏమాత్రం నచ్చలేదని తాను ఆసినిమాలో నటించలేనని తెగేసి దిల్ రాజ్ కు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో దిల్ రాజ్ సాయి పల్లవి స్థానంలో పూజ హెగ్డేని ఎంపిక చేసినట్లు టాక్. ఇప్పుడు ఈవార్తలు ఇలా బయటకు రావడంతో సాయి పల్లవికి నిజంగా సతీష్ వేగ్నేష్ చెప్పిన కథ నచ్చలేదా ? లేదంటే వరస పెట్టి దిల్ రాజ్ ప్రొడక్షన్ హౌస్ కు సినిమాలు చేయడం ఇష్టం లేక ఇలాంటి ట్విస్ట్ ఇచ్చిందా అంటూ రకరకాల ఊహాగానాలు సందడి చేస్తున్నాయి.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM ENTERTAINMENT

Next page