డిఫరెంట్ స్టైల్ లో ఆడియెన్స్ ని ఆకట్టుకునే దర్శకుడు శేఖర్ కమ్ముల కెరీర్ లో మొదటిసారి ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాను స్టార్ట్ చేశాడు. కొత్త హీరో హీరోయిన్ తో ఇదివరకే ఒక లవ్ స్టోరీని స్టార్ట్ చేసిన కమ్ముల ఇప్పుడు నాగ చైతన్య - సాయి పల్లవితో మరో క్యూట్ ప్రేమ కథను సెట్స్ పైకి తెచ్చాడు. 

ఫిదా సినిమాతో సౌత్ లో ఒక్కసారిగా క్రేజ్ అందుకున్న సాయి పల్లవి మరోసారి శేఖర్ కమ్ములతో వర్క్ చేస్తుండడంతో ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు పెరుగుతున్నాయి. ఇక నాగచైతన్య ఈ సినిమాలో సరికొత్తగా కనిపిస్తాడని సమాచారం. అయితే సాయి పల్లవితో ఈ సారి శేఖర్ కమ్ముల ఎలాంటి క్యారెక్టర్ ని ఎలివేట్ చేస్తాడో చూడాలి. రూమర్స్ ప్రకారం ఫిదా పాత్రకు ఆపోజిట్ గా ఉంటుందని  తెలుస్తోంది. 

శ్రీ వెంకటేశ్వరా సినీ క్రియేషన్స్ తో పాటు శేఖర్ కమ్ముల హోమ్ ప్రొడక్షన్ అమిగోస్ క్రియేషన్స్ కూడా ఈ సినిమాను నిర్మిస్తోంది. వీలైనంత త్వరగా సినిమా షూటింగ్ ని పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది.