Asianet News TeluguAsianet News Telugu

'ఆహా' ప్రకటనతో... 'లవ్ స్టోరీ' కలెక్షన్స్ కు దెబ్బ ?

 థియేటర్లకు ప్రేక్షకులు వస్తారో రారో అని భయపడ్డ నిర్మాతల అనుమానాల్ని పటాపంచలు చేసింది. ఆ నేపథ్యంలో లవ్ స్టోరీ సినిమా ను ఓటీటీ లో చూడటం కోసం  ఫ్యామిలీ ఆడియన్స్ చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఆహా లో లవ్ స్టోరీ స్ట్రీమింగ్కు సిద్దం అయ్యింది. ఈ సినిమా స్ట్రీమింగ్ కు సంబంధించి అఫీషియల్ ప్రకటన వచ్చింది.

Sai Pallavi movie Love story digital release date fixed
Author
Hyderabad, First Published Oct 18, 2021, 8:19 AM IST

నాగ చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి కాంబినేషన్ లో రూపొందిన తాజా చిత్రం ల‌వ్‌స్టోరి. శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గ‌త నెల‌లో(సెప్టెంబర్‌ 24) విడుదలై బాక్సాఫీస్‌ వద్ద మంచి హిట్టై, కలెక్షన్స్ రాబట్టింది. కరోనా సెంకడ్‌ వేవ్‌ తర్వాత థియేటర్లలో విడుదలైన పెద్ద సినిమా ఇదే కావటం విశేషం.  థియేటర్లకు ప్రేక్షకులు వస్తారో రారో అని భయపడ్డ నిర్మాతల అనుమానాల్ని పటాపంచలు చేసింది. ఆ నేపథ్యంలో లవ్ స్టోరీ సినిమా ను ఓటీటీ లో చూడటం కోసం  ఫ్యామిలీ ఆడియన్స్ చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఆహా లో లవ్ స్టోరీ స్ట్రీమింగ్కు సిద్దం అయ్యింది. ఈ సినిమా స్ట్రీమింగ్ కు సంబంధించి అఫీషియల్ ప్రకటన వచ్చింది.

 అక్టోబర్ 22 సాయంత్రం 6 గంటల సమయంలో ఆహా లో స్ట్రీమింగ్ అవ్వబోతుంది. ఆహా వారు ప్రత్యేకంగా ఈ సినిమా కోసం ట్రైలర్ ను కట్ చేశారు. ట్రైలర్ ఓటీటీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా కట్ చేసి విడుదల చేశారు.  థియేటర్ ల్లో చూడాలేక పోయిన వారు ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ  సమయంలో  థియేటర్ రిలీజ్ అయిన నెల రోజుల్లోనే ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్దం అయ్యారు. అయితే ఆహా వారు ఈ ప్రకటన ఇవ్వటంతో కలెక్షన్స్ ఏమైనా దెబ్బ పడే అవకాశం ఉందా అనేది ట్రేడ్ లో జరుగుతున్న చర్చ.  ఆహాలో ఎలాగో వచ్చేస్తోంది కదా అని అక్కడే చూద్దామని కొందరు ఓటీటిలోనే చూద్దామని ఫిక్స్ అయ్యే అవకాసం ఉందనటంలో సందేహం లేదు.

 శేఖర్ కమ్ముల ఫిదా తర్వాత తెరకెక్కించిన ఈ సినిమా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంది. క్లైమాక్స్ విషయంలో కాస్త మిశ్రమ స్పందన మినహా మొత్తంగా సినిమా కు సక్సెస్ టాక్ వచ్చింది.  ఇక ఈ చిత్రంలో పాటలు కూడా బాగుండటం,జనాల్లోకి వెళ్లటంతో పాపులారిటీని వచ్చింది. ముఖ్యంగా తెలంగాణ జానపదం ‘సారంగ దరియా’ మరో రేంజ్‌ కు తీసుకెళ్ళింది. ఈ పాట ఇప్పటికే  మూడు వందల మిలియన్స్ పైగా వ్యూస్ రాబట్టి యూట్యూబ్ లో‌ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. 

also read: మోహన్‌బాబుకి చిరంజీవి సంజాయిషీ.. టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌

ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించగా.. కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ మూవీకి అందించిన బెస్ట్ ప్రమోషన్స్ సినిమాపై భారీ హైప్ తీసుకొచ్చి విడుదల తర్వాత కలెక్షన్ల వర్షం కురిపించాయి. చై- సామ్ విడాకుల ప్రకటన అనంతరం చైతూకి ఈ విజయం దక్కడం అక్కినేని అభిమానుల్లో ఆనందం నింపిందనటంలో ఆశ్చర్యం లేదు.
 

Follow Us:
Download App:
  • android
  • ios