హీరోయిన్‌ సాయిపల్లవి `విరాటపర్వం` చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. రానా టార్చ్ బేరర్‌ అంటూ కొనియాడారు. 

`రానా దగ్గుబాటిది పెద్ద హార్ట్. ఎవరూ స్టేజ్‌పైకి వచ్చి ఇలా నా కోసం అరవమని చెప్పరు. నన్ను ఇంతగా ఎంకరేజ్‌ చేయరు. అది ఆయనవల్లే సాధ్యమైంది. రానా పొడవైన వ్యక్తి మాత్రమే కాదు, చాలా విశాల హృదయం ఉన్న వ్యక్తి కూడా. రానా గారు ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్న మిషన్‌ని అందరు ఎంకరేజ్‌ చేయాలి. అది మరింత పెద్దగా ఉండాలని కోరుకుంటున్నా. ఇండస్ట్రీలో ఆయనొక టార్చ్ బేరర్‌ కావాలి. ఆయనతో పనిచేయడం గౌరవంగా భావిస్తున్నా` అని తెలిపింది సాయిపల్లవి.

రానా, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం `విరాటపర్వం`. వేణు ఉడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సుధాకర్‌ చెరుకూరి, శ్రీకాంత్‌ కలిసి నిర్మించారు. ఇందులో ప్రియమణి, నివేదా పేతురాజ్‌, నవీన్‌ చంద్ర, నందితా దాస్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 17న సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో బుధవారం చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని ఏర్పాటు చేశారు. వెంకటేష్‌ గెస్ట్ గా ఈ ఈవెంట్‌ జరిగింది. రామ్‌చరణ్‌ కూడా గెస్ట్ లు హాజరు కావాల్సి ఉన్నా ఫ్లైట్‌ మిస్‌ కావడంతో ఆయన హాజరు కాలేకపోయినట్టు రానా తెలిపారు. 

ఇక ఈ కార్యక్రమంలో సాయిపల్లవి మాట్లాడేందుకు స్టేజ్‌పైకి వచ్చినప్పుడు అభిమానులు అరుపులతో హోరెత్తించారు. అంతేకాదు ఈవెంట్‌లోనూ నిర్వహకులు ఆమెని లేడీ పవర్‌ స్టార్‌ అంటూ పేరు వేయడంతో ఆశ్చర్యపోయింది సాయిపల్లవి. ఆనందంతో ఉప్పొంగిపోయింది. రానా సైతం ఆమె పేరు చెబుతూ గ్యాప్‌ ఇవ్వగా అభిమానులు అరుపులతో మోతెక్కించారు. దీంతో ప్రాంగణం మొత్తం దద్దరిల్లిపోయింది. 

ఈ సందర్భంగా సాయిపల్లవి మాట్లాడుతూ, ఈ ఈవెంట్‌కి వెంకటేష్‌ గెస్ట్ గా వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని తెలిపింది. సినిమా ప్రారంభం రోజు ఆయన వచ్చారని, అప్పుడు ఎంత ఆనందంగా ఉందో, ఇప్పుడు అంతే ఆనందంగా ఉందని తెలిపింది. ఇక `విరాటపర్వం` తాను నటించిన చిత్రాల్లో ముఖ్యమైన సినిమాగా నిలుస్తుందని చెప్పింది. రియల్ లైఫ్‌ ఆధారంగా రూపొందిన చిత్రంలో నటించడం తొలి సారి అని, ఇదొక కొత్త అనుభూతినిచ్చిందని, ఎప్పటికీ ఈ సినిమాని మర్చిపోలేనని తెలిపింది సాయిపల్లవి. సినిమా చేస్తుంటే గొప్ప అనుభూతి చెందానని, థియేటర్లో సినిమా చూస్తుంటే ఆడియెన్స్ కూడా అంతే గొప్ప ఫీలింగ్‌ని పొందుతారని తెలిపింది. ఈ సందర్భంగా ఆర్టిస్టులు, టెక్నీషియన్లకి ఆమె ధన్యవాదాలు తెలిపింది.