టాలీవుడ్ లో సావిత్రి తరువాత ఆ స్థాయి ఫేమ్ తెచ్చుకున్న నటి సౌందర్య. దేశంలోని అన్ని ప్రముఖ భాషలలో నటించిన సౌందర్య లేడీ సూపర్ స్టార్ అనిపించుకున్నారు. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే సౌందర్య  విమాన ప్రమాదంలో మరణించారు. కేవలం 31ఏళ్ల వయసులో సౌందర్య ప్రమాదవశాత్తు ప్రాణాలు విడిచారు. బీజేపీ పార్టీలో చేరిన సౌందర్య ఆ పార్టీ ప్రచారం కోసం వెళుతూ ఫ్లయిట్ కూలిపోయి మరణించారు. గొప్ప నటిగా వందకు పైగా చిత్రాలలో నటించి సౌందర్య జీవితం వెండితెరపైకి తేవాలని ఎప్పటి నుండో ప్రయత్నాలు జరుగుతున్నాయి. 

ఇక నాగ అశ్విన్ దర్శకత్వంలో సావిత్రి జీవితం ఆధారంగా వచ్చిన మహానటి మూవీ సూపర్ సక్సెస్ కావడంతో సౌందర్య బయోపిక్ పై క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఐతే దీని కోసం రంగం సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సౌందర్య బయోపిక్ లో హీరోయిన్ గా టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవిని తీసుకున్నారట. సౌందర్యగా నటించడానికి ఆమెను తీసుకున్నట్లు సదరు వార్తల సారాంశం. 

దీనితో ఒక్కసారిగా సౌందర్య బయోపిక్ హాట్ టాపిక్ గా మారింది. సౌందర్యగా సాయి పల్లవి అద్భుతంగా నటిస్తుంది, ఆమె బయో పిక్ కి బెస్ట్ ఛాయిస్ అంటున్నారు.ఐతే అధికారిక ప్రకటన ఏమి రాకున్నప్పటికీ సినిమాపై చర్చ మాత్రం విపరీతంగా సాగుతుంది. ప్రస్తుతం సాయి పల్లవి తెలుగులో రెండు చిత్రాలు చేస్తుంది. శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న లవ్ స్టోరీ మరియు రానా హీరోగా తెరకెక్కుతున్న విరాటపర్వం చిత్రాలలో నటిస్తుంది. ఈ రెండు చిత్రాలపై పరిశ్రమలో మంచి అంచనాలున్నాయి.