చాలా కాలంగా కనిపించడంలేదు సాయి పల్లవి.. తాజాగా కాశ్మీర్ లో ప్రత్యక్షం అయ్యింది. ఇంతకీ అక్కడ ఏం చేస్తోంది. ఏదైనా షూటింగ్ కోసం వెళ్లిందా..?
సాయి పల్లవి సెలక్టీవ్ గా సినిమాలు చేస్తుంది. ఈ మధ్య అలా కూడా చేయడం లేదు. గార్గీ సినిమా తరువాత ఆమె అసలు వెండితెరపై మెరవలేదు. సినిమాలు కూడా సైన్ చేయలేదు. మరి సాయి పల్లవి ఏమైంది అని వెతుక్కుంటున్న టైమ్ లో సడెన్ గా కాశ్మీర్ లో ప్రత్యక్షం అయ్యింది. అక్కడ ఏం చేస్తుంది అని ఆరా తీయ్యగా.. ఆమె తమిళ సినిమా షూటింగ్ కోసం కశ్మీర్ వచ్చినట్టు తెలుస్తోంది.
తమిళనాట నేచురల్ స్టార్ గా పేరుతెచ్చుకున్న హీరో శివ కార్తికేయన్..రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో ఓమూవీ చేస్తున్నాడు. ఈసినిమా SK21 వర్కింగ్ టైటిల్‌తో రూపుదిద్దుకుంటుంది. ఇక ఈ సినిమాలో శివ కార్తికేయన్ సరసన సాయిపల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. లోకనాయకుడు కమల్‌హాసన్. ఆర్.మహేంద్రన్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈసినిమాను సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ సంస్థ సమర్పిస్తోంది. రెహమాన్ మేనల్లుడు యంగ్ స్టార్ జి.వి ప్రకాష్ సంగీతాన్ని అందిస్తున్న ఈసినిమాలో విశ్వరూం ఫేం రాహుల్ బోస్ విలన్‌గా నటిస్తున్నారు.
ఇక అమూవీ షూటింగ్ ప్రస్తుతం కశ్మీర్ లో జరుగుతుంది. మేలో చెన్నైలో స్టార్ట్ అయిన ఈసినిమా షూటింగ్ ప్రస్తుంతం కశ్మీర్ చేరింది. కాగా.. ఈ షూటింగ్ కోసం సాయి పల్లవి కూడా కశ్మీర్ వెల్లగా.. ఆమె అక్కడ షూటింగ్ లోకేషన్‌లో దిగిన ఫోటోలు, రాహుల్ బోస్ మేకప్ వేసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ నెల అంతా కశ్మీర్ లోనే ఈ మూవీ షూటింగ్ జరగబోతున్నట్టు తెలస్తోంది.
ఇదిలా ఉంటే.. సాయి పల్లవి ఎన్టీఆర్ జతగా నటించబోతున్నట్టు న్యూస్ తాజాగా వైరల్ అయ్యింది. కొరటాల డైరెక్షన్ లో ఎన్టీఆర్ నటిస్తున్న పాన్ వరల్డ్ మూవీ దేవరలో.. సాయి పల్లవి ఎన్టీఆర్ భార్యగా నటించబోతున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. ఈ న్యూస్ తప్పించి ఆమె మరో సినిమా చేస్తున్నట్టు జాడ లేదు. ఇక శివకార్తికేయన్ మాత్రం మండేలా ఫేమ్ మడోన్ అశ్విన్ దర్శకత్వంలో మహావీరుడు చిత్రంలోనూ నటిస్తున్నారు. ఈ సినిమా జూలై 14న రిలీజ్ కాబోతోంద. ఈ సినిమాతో పాటు అయలాన్ మూవీలో కూడా నటిస్తున్నాడు యంగ్ స్టార్.ఆర్. రవికుమార్ దర్శకత్వం వహిస్తుండగా.. ఈ సినిమాలో శివకార్తికేయన్ జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుంది.
