కెరీర్ మొదట్లో ఫెమ్ వచ్చే వరకు రెమ్యునరేషన్ గురించి ఎవరు కూడా పెద్దగా ఆలోచించరు. కానీ ఒక్క సినిమా హిట్టయితే రూపాయి తక్కువైనా ఒప్పుకోరు. నెక్స్ట్ సినిమాకు డబుల్ పేమెంట్స్ వసూలు చేయడం కామన్. అలాంటిది సాయి పల్లవి తన రెమ్యునరేషన్ లో సగం వరకు నిర్మాత ఇస్తున్నా కూడా తీసుకోలేదట. 

మొన్నటి వరకు రెమ్యునరేషన్ ఎక్కువగా డిమాండ్ చేస్తోన్న సాయి పల్లవి అంటూ సోషల్ మీడియాలో రూమర్స్ బాగానే వచ్చాయి. అప్పుడు సాయి పల్లవి వాటిని పట్టించుకోలేదు. సమయం వచ్చినప్పుడు ఎవరి క్యారెక్టర్ ఏమిటో తెలుస్తుందని ఈ బ్యూటీ నిరూపించింది. శర్వానంద్ కు జోడిగా నటించిన పడి పడి లేచే మనసు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే. సినిమాకు నెగిటివ్ రిజల్ట్ తో కలెక్షన్స్ సరిగ్గా రాలేవు. దీంతో నిర్మాత సుధాకర్ కి తీవ్రంగా నష్టాలు వచ్చాయి.

మొదట్లో సాయి పల్లవి రెమ్యునరేషన్ లో కొంత తక్కువ ఇచ్చిన నిర్మాత సినిమా విడుదల తరువాత తప్పకుండా ఇస్తాను అని మాట ఇచ్చాడట. అయితే సినిమాకు అనుకున్నంతగా కలెక్షన్స్ రాకపోవడంతో పరిస్థితిని అర్ధం చేసుకున్న ఫిదా బ్యూటీ నిర్మాత ఇవ్వాల్సిన 40 లక్షల ఎమౌంట్ తిరిగి ఇస్తుంటే వద్దని చెప్పిందట. ఇక నిర్మాత సాయి పల్లవి పేరెంట్స్ కి ఇద్దామని అనుకుంటే వారు కూడా కూతురు తీసుకున్న నిర్ణయాన్నీ గౌరవిస్తున్నట్లు నిర్మాతకు సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది.