సహజసిద్ధమైన అందం, ఆకట్టునే నటనతో సాయి పల్లవి సౌత్ లో మొత్తం క్రేజ్ తెచ్చుకుంది. సాయి పల్లవిపై చిత్ర పరిశ్రమలో అనేక రూమర్స్ ఉన్నాయి. సినిమాల విషయంలో నిర్మాతలకు చుక్కలు చూపిస్తుందని, చాలా కండిషన్స్ పెడుతుందనే టాక్ ఉంది. ఇదిలా ఉండగా సాయి పల్లవి ఇటీవల 2 కోట్ల భారీ డీల్ వదులుకుందనే విషయం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా సాయి పల్లవి ఈ విషయం గురించి స్పందించింది. 

ఓ ఫెయిర్ నెస్ యాడ్ లో నటించేందుకు ఓ కార్పొరేట్ సంస్థ సాయి పల్లవికి  2 కోట్ల ఆఫర్ ఇచ్చింది. కానీ ప్రజలని మోసం చేయడం ఇష్టంలేక సాయిపల్లవి ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేసింది. దానికి గల కారణాలని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. మహిళలకు తప్పుడు సందేశాలు ఇవ్వడం నాకు ఇష్టం లేదు. నా చెల్లి బర్గర్స్ ఎక్కువగా తింటుంది. తన చర్మం కంటే నా చర్మం కాంతివంతంగా ఉంటుందని నాతో చెప్పింది. నీ రంగు కాంతివంతంగా మారాలంటే పండ్లు, కూరగాయలు ఎక్కువగా తిను అని చెప్పా. ప్రస్తుతం నా చెల్లి నేను చెప్పినట్లే చేస్తోంది. 

ఫెయిర్ నెస్ యాడ్ లో నటించి వచ్చిన 2 కోట్ల డబ్బుతో నేను ఏం సాధించాలి. 2 కోట్ల ఆఫర్ అందుకున్నా ఇంట్లో చెపాతీలు లేదా అన్నం మాత్రమే తింటాను. అవి ఆల్రెడీ నాకు ఉన్నాయి అని సాయిపల్లవి తెలిపింది. మన భారతీయుల రంగు ఎలా ఉండాలో అందరికి అలాగే ఉంది. విదేశాలకు వెళ్లి మీ రంగు తెల్లగా ఎందుకు ఉంది అని అడగగాలమా అని సాయి పల్లవి తెలిపింది. వారి చర్మం తెల్లగా ఉండడం వల్లే క్యాన్సర్ వస్తోంది. మనం భారతీయులం.. ఇలాగె ఉంటాం అని సాయి పల్లవి పేర్కొంది.