సాయిపల్లవి, రానా నటించిన `విరాటపర్వం` విడుదలై ఏడాది పూర్తి చేసుకుంది. వేణు ఉడుగులు దర్శకత్వం వహించిన ఈ సినిమాని ఉద్దేశించిన సాయిపల్లవి ఎమోషనల్‌ పోస్ట్ పెట్టింది. అది వైరల్‌ అవుతుంది.

సాయిపల్లవి.. `విరాటపర్వం` చిత్రంలో వెన్నెలగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఆద్యంతం ఎమోషనల్‌గా సాగే ఆమె పాత్ర ఆడియెన్స్ లో బలమైన ముద్ర వేసుకుంది. ఆ పాత్రలోనూ సాయిపల్లవి జీవించింది. వెన్నెల(రియల్‌ లైఫ్‌ సరళ) అంటే ఇలానే ఉంటుందేమో అన్నంతగా పాత్రకి ప్రాణం పోసింది. విమర్శల ప్రశంసలందుకుంది. `విరాటపర్వం` సినిమాని తన భుజాలపై నడిపించింది. ఈ సినిమా కమర్షియల్‌గా ఆడలేదు, కానీ విమర్శలకు ప్రశంసలందుకుంది. అభ్యూదయవాదుల మన్ననలు పోందింది. అందులోనూ ముఖ్యంగా సాయిపల్లవి నటన అందరిని ఫిదా చేసింది. 

తాజాగా `విరాటపర్వం` విడుదలై ఏడాది అవుతుంది. గతేడాది జూన్‌ 17న ఈ చిత్రం విడుదలైంది. వేణు ఉడుగుల దర్శకత్వం వహించారు. ఇందులో మేల్‌ లీడ్‌గా రానా నటించగా, ప్రియమణి, నవీన్‌ చంద్ర, నివేతా పేతురాజ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా నిన్నటి(శనివారం)తో ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సాయిపల్లవి ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టింది. `విరాటపర్వం` సినిమా తన మనసుకు దగ్గరైన సినిమాగా తెలిపింది. `ఈ రోజు వచ్చిన శుభాకాంక్షలకు ధన్యవాదాలు. `విరాటపర్వం` ఎప్పుడూ నా హృదయానికి దగ్గరగా ఉంటుంది` అని పేర్కొంది. అంతేకాదు మీకు వెన్నెల హాయ్‌ చెబుతుందన్నట్టుగా పేర్కొంది. లవ్‌ ఎమోజీలను పంచుకుంది సాయిపల్లవి. మరోవైపు సినిమాలోని తన స్టిల్స్ షేర్‌ చేసుకుంది. ప్రస్తుతం ఆమె పోస్ట్ నెట్టింట వైరల్‌ అవుతుంది. 

మరోవైపు చిత్ర దర్శకుడు వేణు ఉడుగుల అంతకు ముందు ట్విట్టర్‌ ద్వారా ఎమోషనల్‌ పోస్ట్ పెట్టారు. `విరాటపర్వం` విడుదలై ఈరోజుతో ఏడాది పూర్తయింది. విరాట పర్వానికి ముందు ఉన్న 'నేను' దాని విడుదల తర్వాత ఉన్న 'నేను' ఒకటి మాత్రం కాదు. విరాటపర్వం అందమైన అనుభూతుల్ని ఇచ్చింది. ఎందరో బుద్ధి జీవుల ప్రగతిశీల ప్రేక్షకుల అభిమానాన్ని, ప్రేమను ఇచ్చింది. అదే సమయంలో మార్కెట్ కొట్టే దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపించింది. కాలి కింద మందుపాతర పేలినట్టయింది. కొన్ని నెలలపాటు నిద్ర లేని రాత్రులనిచ్చింది. ఈ వైరుధ్యం నన్ను ఆలోచనలో పడేసింది. నాకు నా ప్రేక్షకులకు మధ్య అనుబంధాన్ని పునః సమీక్షించుకోవాల్సిన అవసరాన్ని విప్పి చెప్పింది. 

Scroll to load tweet…

ఈ ఏడాది పాటు నాలో సృజనాత్మక వ్యక్తిత్వాన్ని నేను మరింత అర్థం చేసుకోవడానికి స్ఫూర్తినిచ్చింది. అందుకే `విరాటపర్వం` నాకు ఒక సెల్ఫ్ డిస్కవరీ లాంటిది. తీయబోయే చిత్రాలకు ఉపోద్ఘాతం లాంటిది. `విరాటపర్వం` అనే ప్రయాణం మొదలెట్టిన నాటి నుండి ఇప్పటివరకు ఇక ముందు ఈ అనుభవంలో భాగమైన నా ప్రేక్షకులకు , తూము సరళక్క కుటుంబ సభ్యులకు సినిమాలో నటించిన నటీనటులకు, నా డైరెక్షన్ టీమ్ కి, రైటింగ్ టీమ్ కి, మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలికి, ప్రియమణి, నందిత దాస్, నవీన్ చంద్ర, మీడియా కి, మరీ ముఖ్యంగా నా నిర్మాతలు సురేష్‌బాబు, సుధాకర్‌ చెరుకూరి, హీరో రానా, హీరోయిన్‌ సాయిపల్లవిలకు తన ప్రత్యేక కృతజ్ఞతలు` అని తెలిపారు వేణు ఉడుగుల. మొత్తంగా `విరాటపర్వం` ఏడాదిపాటు నాలో ఏర్పడిన పరివర్తనగా ఆయన అభివర్ణించారు.