రౌడీ బేబి సాంగ్ మొత్తానికి మరో రికార్డ్ కొట్టేసింది. మారీ 2 సినిమా కోసం ధనుష్ సొంతంగా రాసి పాడిన విధానం సాయి పల్లవి సరికొత్త స్టెప్పులు ఇక యువన్ శంకర్ రాజా అందించిన మ్యూజిక్ కి తగ్గటుగా ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా కొరియోగ్రఫీ రౌడీ బేబీ సాంగ్ ను ఒక రేంజ్ కు తీసుకెళ్లాయి. ఇది పక్కా కాంబినేషన్ హిట్ అని చెప్పాలి. 

అన్ని టెక్నీక్స్ సినిమాకు బాగా ఉపయోగించిన ఈ సాంగ్ యూ ట్యూబ్ లో 200 మిలియన్ వ్యూవ్స్ ని అందుకుంది. 1.5 మిలియన్ లైక్స్ అందుకున్న ఈ సాంగ్ సౌత్ లో టాప్ 1 లో ఒకటిగా నిలిచింది. ఇంతకుముందు సాయి పల్లవి వచ్చిందే సాంగ్ 180 మిళియన్స్ వ్యూవ్స్ తో టాప్ లో నిలువగా ఇప్పుడు సాయి పల్లవి నుంచి వచ్చిన రౌడీ బేబీ మరో రికార్డ్ ను అందుకుంది. 

ఇక రంగస్థలం రంగమ్మ్మ మంగమ్మ సాంగ్ తో సమంత 150మిళియన్స్ ఇంకా కొద్దీ దూరంలోనే ఉంది. అసలైతే రౌడీ బేబీ సాంగ్ ఈ రేంజ్ లో యూ ట్యూబ్ లో సంచలనం సృష్టిస్తుందని ఎవరు ఊహించలేదు.  బాలాజీమోహన్ దర్శకత్వం వహించిన మారీ 2 సినిమా డిసెంబర్ 21న రీలీజయ్యింది. అయితే సినిమా మాత్రం హిట్టవ్వలేదు.