ఫిదా సినిమాతో సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న సాయి పల్లవి వరుస సినిమాలతో దూసుకుపోతోంది. పోటీగా ఎంత మంది స్టార్ హీరోయిన్స్ ఉన్నప్పటికీ అమ్మడికి అందే ఆఫర్స్ స్పెషల్ గా ఉంటున్నాయి. ఇక వ్యక్తిగత విషయాలపై పల్లవి ఈ మధ్య తెగ కామెంట్ చేస్తోంది. 

స్టార్ హీరోయిన్ గా మారీన తరువాత అమ్మడిపై మీడియా ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. ఇక ఇంటర్వ్యూలకెళితే ప్రేమ వ్యవహారాలు, కాబోయే ప్రియుడు ఎలా ఉండాలి అనే ప్రశ్నలను వదులుతున్నారు. రీసెంట్ గా పెళ్లి సహజీవనంపై కూడా సాయి పల్లవి కొంచెం పాజిటివ్ గానే స్పందించింది. పెళ్లి కాకముందే లీవింగ్‌ టుగెదర్‌ సంబంధం అనేది తప్పేమి కాదని ఎవరి వ్యక్తిగత నిర్ణయాలు వారి ఇష్టమని చెప్పింది. 

ఇక తాను మాత్రం అలాంటి రిలేషన్ ని కోరుకోవడం లేదని చెబుతూ దాని అవసరం కూడా లేదని సాయి పల్లవి వివరణ ఇచ్చింది. ఇక స్కూల్ అండ్ కాలేజ్ డేస్ నుంచి కూడా ఎలాంటి ప్రేమ వ్యవహారాలు లెవీని అప్పుడు పుస్తకాలతో ఇప్పుడు సినిమాలతో ప్రేమలో ఉన్నట్లు తనదైన శైలిలో జవాబు ఇచ్చింది.