`మాయసభ`లో సాయికుమార్ పాత్రకి సంబంధించిన అసక్తికర అప్ డేట్ బయటకు వచ్చింది. అలాగే మై విలేజ్ షో అనిల్ `మొతెవరి లవ్ స్టోరీ` అంటూ రచ్చే చేసేందుకు వస్తున్నారు.
KNOW
విలక్షణ నటుడిగా రాణిస్తున్న సాయికుమార్ ఒకప్పుడు హీరోగా మెప్పించారు. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు. ప్రస్తుతం పదుల సంఖ్యల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.
ఓ వైపు సినిమాలు, మరోవైపు వెబ్ సిరీస్‌లు చేస్తూ రాణిస్తున్నారు. ఫ్లాట్‌ఫామ్ ఏదైనా, పాత్ర ఏదైనా దానికి ప్రాణం పోయడం సాయికుమార్‌కి వెన్నతో పెట్టిన విద్య.
అందులో భాగంగానే ఇప్పుడు ఒక ఆసక్తికరమైన వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. దేవా కట్టా రూపొందిస్తున్న `మాయసభ` వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు.
సాయికుమార్‌కి దేవా కట్టా బర్త్ డే విషెస్
ఈ విషయాన్ని తెలియజేస్తూ దేవా కట్టా తాజాగా సాయికుమార్‌కి బర్త్ డే విషెస్ తెలిపారు. `ప్రస్థానం`, `ఆటోనగర్ సూర్య` తర్వాత `మాయసభ`లో మీతో మూడోసారి పనిచేయడం చాలా ఎంజాయ్ చేశాను.
మీరు నిండు నూరేళ్లు ఆనందంగా, ఆరోగ్యంగా మీకు నచ్చిన పాత్రలు చేస్తూ లైఫ్‌ని ఎంజాయ్ చేయాలని మీ అభిమానిగా ఆశిస్తున్నా. ఇక్కడ మీరు ఏ పాత్ర పోషించారో, కానీ తుక్కు రేగ్గొట్టారు. తెలుగు ప్రేక్షకులు ఆగస్ట్ 7న మరోసారి మీ నట విశ్వరూపాన్ని చూడబోతున్నారు` అని వెల్లడించారు దేవా కట్టా.
ఎన్టీఆర్ రోల్‌లో సాయికుమార్?
అయితే ఇందులో సాయికుమార్ నటించేది ఎన్టీఆర్ పాత్ర అని తెలుస్తోంది. ఇది చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితాలను ఆధారంగా చేసుకుని, వారి స్నేహాన్ని ప్రధానంగా చేసుకుని ఈ `మాయసభ`ని రూపొందిస్తున్నారు దేవాకట్టా.
ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆయనకు వ్యతిరేకంగా చంద్రబాబునాయుడు చేపట్టిన చర్యలు, అందులో వైఎస్‌ఆర్ పాత్ర వంటివి ఇందులో చూపించబోతున్నట్టు ఆ మధ్య విడుదలైన ట్రైలర్‌ని బట్టి అర్థమయ్యింది. ఈ వెబ్ సిరీస్ ఆగస్ట్ 7న సోనీలివ్‌లో స్ట్రీమింగ్ కానుంది.
`మోతెవరి లవ్ స్టోరీ`తో రాబోతున్న మై విలేజ్ షో అనిల్
`మై విలేష్ షో` యూట్యూబ్ ప్రోగ్రామ్ ద్వారా పాపులర్ అయ్యాఉ అనిల్ గీలా. ఇప్పుడు ఆయన హీరోగా మారాడు. `మోతెవరి లవ్ స్టోరీ`తో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. ఇందులో ఆయనకు జోడీగా వర్షిణి రెడ్డి జున్నుతుల హీరోయిన్‌గా నటించింది. శివకృష్ణ బుర్రా ఈ సిరీస్‌ని రూపొందించారు. స్వచ్ఛమైన తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ విలేజ్ కామెడీ, లవ్ సిరీస్‌ని జీ 5లో రాబోతుంది. ఆగస్ట్ 8న ఇది స్ట్రీమింగ్ కానుంది. తాజాగా దీనికి సంబంధించిన ట్రైలర్‌ని విడుదల చేశారు.

`మొతెవరి లవ్ స్టోరీ` ట్రైలర్ ఎలా ఉందంటే?
‘ఇగో ఇదే మా ఊరు.. ఆరె పల్లి.. ఊరుఊరుకో మోతెవరి ఉన్నట్టు.. మా ఊరికి ఓ మోతెవరి ఉన్నడు..’ అంటూ ప్రియదర్శి వాయిస్ ఓవర్‌తో ప్రారంభమైన ట్రైలర్ ఆద్యంతం వినోదభరితంగా సాగింది.
హీరో అనిల్ పరిచయం, హీరోయిన్ వర్షిణితో లవ్ ట్రాక్, ఊర్లోని పెద్దలు, భూ సమస్య, ప్రేమ వంటి అంశాలతో ట్రైలర్ సాగింది. ఈ ట్రైలర్‌ను చూస్తుంటే ఈ సిరీస్‌ను ఆద్యంతం వినోద భరితంగా మలిచారని అర్థం అవుతోంది.
‘పర్శిగాడంటేనే పర్‌ఫెక్ట్’, ‘ఉశికే ఉడికించుడే’ అనే డైలాగ్స్ నవ్వులు పూయించేలా ఉన్నాయి. ‘అమ్మాయిలు భలేగా ఉంటరే.. మోసాన్ని కూడా ముద్దుగ చెప్తరే’ అంటూ సాగే డైలాగ్ ఎమోషనల్ డెప్త్‌ను కూడా చూపిస్తోంది. ఆగస్ట్ 8న జీ 5లో ఇది స్ట్రీమింగ్ కానుంది.
చరణ్ అర్జున్ సంగీతాన్ని అందించగా.. శ్రీకాంత్ అరుపుల కెమెరామెన్‌గా పని చేశారు. మధుర శ్రీధర్, శ్రీరామ్ శ్రీకాంత్ సంయుక్తంగా నిర్మించిన ఈ సిరీస్‌లో అనిల్ గీలా, వర్షిణి, మురళీధర్, సదానందం, సుజాత వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు.

