ఏదైనా పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది అంటే.. అటు రివ్యూలతో పాటు. ఆ సినిమా గురించి ఏ స్టార్ హీరో ఏం స్టేట్ మెంట్ ఇస్తున్నాడో అని అందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇక కేజియఫ్ విషయంలో కూడా మెగా హీరో కామెంట్స్ వైరల్ అవుతుంది.
ఏదైనా పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది అంటే.. అటు రివ్యూలతో పాటు. ఆ సినిమా గురించి ఏ స్టార్ హీరో ఏం స్టేట్ మెంట్ ఇస్తున్నాడో అని అందరికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇక కేజియఫ్ విషయంలో కూడా మెగా హీరో కామెంట్స్ వైరల్ అవుతుంది.
కేజీఎఫ్ 2 ప్రపంచ వ్యాప్తంగా ఈరోజు(14 ఏప్రిల్) భారీ స్థాయిలో ప్రక్షకుల ముందుకువచ్చింది. సినిమాపై పాజిటీవ్ టాక్ రావడంతో కెజియఫ్ ఫ్యాన్స్ దిల్ కుష్.. అవుతున్నారు. ఈ సందర్భంగా కెజియఫ్2 పై స్టార్ట్ వరుసగా స్పందిస్తున్నారు. ఇక ఈసినిమా గురించి టాలీవుడ్ యంగ్ హీరో మెగా మేల్లుడు సాయి ధరమ్ తేజ్ స్పందించారు. ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ రాకింగ్ స్టార్ యష్, శ్రీనిధి శెట్టి జంటగా.. రవీనా టాండన్, సంజయ్ దత్, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. పాన్ ఇండియన్ సినిమాగా భారీ బడ్జెట్‌తో హోంబలే నిర్మాణ సంస్థలో విజయ్ కిరంగదూర్ నిర్మించగా, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ తెచ్చుకుంది.
అయితే, కేజీఎఫ్ 2 విడుదల సందర్భంగా సాయి ధరమ్ తేజ్ ఇలా కామెంట్ చేశారు. కేజీఎఫ్ మూవీతో భారతీయ సినిమాను ఉర్రూతలుగించారు. అంతేకాదు, దేశ వ్యాప్తంగా వినిపించారు అలాగే, ఇప్పుడు కేజీఎఫ్ 2తో మరోసారి భారతీయ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఆకట్టుకోవాలి' అని ట్వీట్‌లో రాసుకొచ్చారు సాయి తేజ్. ఇక మూవీ టీమ్ మొత్తాన్ని సాయి తేజ్ విష్ చేశారు.ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
