క్రమ పద్దతిలో బరువు పెరగటం, తగ్గటం రెండూ కష్టమైన పనులే. ముఖ్యంగా పెరిగిన బరువుని ఒదిలించుకోవటం అతి కష్టం. అందుకోసం రాత్రింబవళ్లూ డైట్ కంట్రోలు చేస్తూ జిమ్ లో చెమటోడ్చాలి. ఇష్టమొచ్చినట్లు చేస్తే షేప్ అవుట్ అవుతుంది. జిమ్ ట్రైనర్ ని పెట్టుకోవాలి. బరువు పెరగకుండా ఆకలి తీరే విటమిన్స్ ఉంటే ఫుడ్ తీసుకోవాలి. ఇలా ఎన్నో ఇబ్బందులు. మనకు తెరపై కనపడే హీరోలు తెర వెనక పడే కష్టం తెలిస్తే ఆశ్చర్యం, జాలి వేస్తుంది. ఇప్పుడు సాయి ధరమ్ తేజ పరిస్దితి అదే అంటున్నారు.

చిత్రలహరి సినిమా కోసం శరీరం పెంచిన సాయి..ఇప్పుడు బరువు తగ్గాల్సిన పరిస్దితి వచ్చింది. అది కూడా పాతిక కేజీలు ఒక్కసారిగా తగ్గాలి. తన తదుపరి చిత్రం మారుతి తో చేస్తున్న నేపధ్యంలో పెట్టిన కండీషన్ ఇది. తన కథకు..నాజూకుగా ఉండే కుర్రాడు ఉండాలి అని మారుతి క్లియర్ గా చెప్పటంతో ఇప్పుడు ప్రత్యేకమైన జిమ్ కోచ్ ని ఏర్పాటు చేసుకుని కష్టపడుతున్నాడట. అయితే మే నెలలో ఈ సనిమా ప్రారంభం కానుంది. అంటే అప్పటిలోగా టార్గెట్ 25 పూర్తి కావాలి. 

ఈ విషయమై మెగా హీరోలంతా తమ అనుభాలతో సలహాలు ఇస్తున్నారట. యువి క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించే ఈ చిత్రం పూర్తి కామెడీతో సాగనుందిట. ఇప్పటికే మారుతి స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి ప్రీ ప్రొడక్షన్ పనిలో పడ్డారట. మీడియం బడ్జెట్ లో తెరకెక్కించి సూపర్ హిట్ కొట్టాలని నిర్మాత అల్లు అరవింద్ క్లియర్ గా చెప్పటంతో అందుకు తగినట్లుగా మారుతి స్క్రిప్టులో మార్పులు, చేర్పులు చేస్తున్నారట. ఈ సినిమా తర్వాత తన ఇమేజ్ మారుతుందని, ఫ్యామిలీలకు దగ్గర అవుతానని సాయి భావిస్తున్నారట. అందుకే పాతిక కేజీలు తగ్గాలన్నా సై అని ఆ పనిలో పడిపోయాడట.