Virupaksha collections : ‘విరూపాక్ష’ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఎన్ని కోట్లు వసూల్ చేసిందంటే?
సాయి ధరమ్ తేజ్ కు Virupakshaతో సాలిడ్ కమ్ బ్యాక్ దక్కింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తొలిరోజు కాసుల వర్షం కురిపించింది. తాజాగా మేకర్స్ ఫస్ట్ డే కలెక్షన్లను అధికారికంగా వెల్లడించారు.
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) - హీరోయిన్ సంయుక్తా మీనన్ జంటగా నటించిన చిత్రం ‘విరూపాక్ష’. నిన్న గ్రాండ్ గా థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. చిత్రానికి కార్తీ దండు అందించిన దర్శకత్వం నెక్ట్స్ లెవల్ ల్లో ఉందంటూ ఆడియెన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రేక్షకుల నుంచి చిత్రానికి పాజిటివ్ టాక్ వినిపించింది. దీంతో సాయి ధరమ్ తేజ్ బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను కూడా సెలబ్రేట్ చేసుకున్న విషయం తెలిపిందే.
ఇక Virupaksha చిత్రం బాక్సాఫీస్ వద్ద కూడా కాసుల వర్షం కురిపిస్తోంది. తాజాగా మేకర్స్ ఫస్ట్ డే కలెక్షన్లకు సంబంధి అధికారిక ప్రకటన అందించారు. తొలిరోజు మొత్తంగా రూ.12 కోట్ల వరకు వసూల్ చేసినట్టు వెల్లడించారు. అయితే వాస్తవ కలెక్షన్లు అంతగా లేవని ట్రేడ్ వర్గాల టాక్. రెండు తెలుగు రాష్ట్రాల్లో 4.79 కోట్ల నెట్, 7.7 కోట్ల గ్రాస్ రాబట్టింది. వరల్డ్ వైడ్‌గా 11కోట్లు చేసిందట.
ఏరియా వైజ్ గా కలెక్షన్ల వివరాలు ఇలా ఉన్నాయి.
నైజాం - రూ.1.82 కోట్లు
సీడెడ్ - రూ.54 లక్షలు
ఉత్తరాంద్ర - రూ.58 లక్షలు
ఈస్ట్ గోదావరి - రూ.40 లక్షలు
వెస్ట్ గోదావరి - రూ.47 లక్షలు
గుంటూరు - రూ. 46 లక్షలు
క్రిష్ణ - రూ.32 లక్షలు
నెల్లూరు - 20 లక్షలు
కర్టాటక, మిగితా ఏరియాలో - రూ.36 లక్షలు
ఓవర్సీస్ లో రూ.1.20 కోట్లు
మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలా కలెక్షన్లు వచ్చినట్టు ట్రెండ్ వర్గాలు ఏరియా వైజ్ గా అంచనా వేస్తున్నారు. వరల్డ్ వైడ్ గా 6.25 కోట్ల షేర్ నమోదైనట్టు తెలుస్తోంది. ఇక ‘విరూపాక్ష’ వరల్డ్ వైడ్ గా రూ.25 కోట్ల రేంజ్లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అది రీచ్ అవుతుందా? అనేది ప్రశ్నగా మారింది. ఇదే ఇప్పుడు చిత్ర యూనిట్‌ని ఆందోళనకి గురి చేస్తుంది. బయటకు ఓవర్‌గా పాజిటివ్ టాక్ స్ప్రెడ్ చేసినా, జనరల్ ఆడియెన్స్ కి మాత్రం సినిమా పెద్దగా ఎక్కదు. పైగా మల్టీఫ్లెక్స్ లో టికెట్ రేట్లు (295)కూడా ఈ సినిమాకి మైనస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇలాంటి సినిమాలను మల్టీఫ్లెక్స్ ఆడియెన్సే ఆదరిస్తారు, బీ, సీ సెంటర్లలో పెద్దగా ఆదరణ ఉండదు.
ఈ సినిమా ఎంత ఆడినా ఈ మూడు రోజులే. ఆ తర్వాత ఇది పడిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది రొటీన్ హర్రర్ థ్రిల్లర్‌గా నిలిచింది. ప్రధానంగా సినిమాలో ఎమోషన్స్ పండలేదు. అంతా ఆర్టిఫిషియల్‌గానే అనిపిస్తుంది. మరోవైపు సాయిధరమ్ తేజ్ పాత్ర బలంగా లేదు. అనారోగ్యం కారణంగా కావచ్చు, చాలా సీన్లలో ఏం చేయలేని స్థితిలో కనినిస్తుంటాడు. అదే సినిమాకి మైనస్. పైగా ఇది హీరోయిన్ చుట్టూ తిరిగే కథ. దీంతో సాయి పాత్రని ఇరికించినట్టుగానే ఉందిగానీ బలంగా లేదు. అది మెగా ఫ్యాన్స్ ని సైతం నిరాశకి గురి చేస్తుంది. కానీ ప్రమాదం తర్వాత చేసిన సినిమా కావడంతో ఆ సింపతి ఈ చిత్రానికి కలిసొస్తుంది.
మిస్టరీ థ్రిల్లర్ చిత్రం ‘విరూపాక్ష’ను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై బాపినీడు.బి సమర్పణలో ప్రముఖ నిర్మాత బీఎస్‌ఎన్ ప్రసాద్ (BVSN Prasad) నిర్మించారు. పాన్ ఇండియా రేంజ్‌లో ఈ చిత్రాన్ని ఏప్రిల్ 21న భారీ ఎత్తున విడుదల చేశారు. నవీన్ నూలి ఎడిటర్ గా బాధ్యతలు చూశారు. బి.అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించారు. సునీల్, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషించారు.