విరూపాక్ష మూవీ తెలుగులో బ్లాక్ బస్టర్ విజయాన్ని పొందడంతో.. ఇక ఇతర భాషలపై దృష్టి పెట్టారు మేకర్స్ . ముందుగా బాలీవుడ్ పై గట్టిగా దృష్టి పెట్టారు. 

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా నటించిన హారర్ థ్రిల్లర్ మూవీ విరూపాక్ష. సుకుమార్ స్కూల్ నుంచి వచ్చిన కొత్త దర్శకుడు కార్తీక్ దండు రూపొందించిన ఈసినిమా బాక్స్ఆఫీస్ దగ్గర భారీ విజయాన్నినమోదు చేసింది. అంతే కాదు కలెక్షన్లు వాన కురిపించింది. విరూపాక్ష మూవీని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించినా.. ముందుగా తెలుగు, భాషల్లో మాత్రమే రిలీజ్ చేశారు. ఇక్కడ రిజల్ట్ ను బట్టి.. బాలీవుడ్ తో పాటు.. ఇతర భాషల్లో రిలీజ్ చేయాలి అని ఫిక్స్ అయ్యారు. వారు అనుకున్న విధంగా.. తెలుగులో ఈమూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని పొందడంతో.. ఇక ఇతర భాషలపై దృష్టి పెట్టారు మేకర్స్ . ముందుగా బాలీవుడ్ పై గట్టిగా దృష్టి పెట్టారు. 

విరూపాక్షను పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మూవీ టీమ్. ఇందులో భాగంగా హిందీలో గ్రాండ్ రిలీజ్ కు ప్లాన్ చేశారు. అంతే కాదు ముంబయ్ లో ఘనంగా ప్రీ రిలీజ్ కూడా చేయబోతున్నారు. ఈ క్రమంలోనే హిందీలో గోల్డ్ మైన్స్ సంస్థ, తమిళంలో స్టూడియో గ్రీన్, మలయాళంలో E4 ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ హౌస్ లు ఈ మూవీ రిలీజ్ హక్కులను సొంతం చేసుకున్నారు. మే 5 విరూపాక్ష ఇతర భాషల్లో రిలీజ్ అవ్వబోతోంది. 

Scroll to load tweet…

 ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా విరూపాక్ష టీం పాన్ ఇండియాలో సందడి చేస్తుంది. ఇక ఈరోజు బాలీవుడ్ లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగబోతుంది. ఇందుకోసం సాయి ధరమ్ ఇప్పటికే ముంబై చేరుకున్నాడు. ముంబై ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయిన సాయి ధరమ్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథి ఎవరు అన్నదానిపై క్లారిటీ ఇవ్వలేదు మూవీ టీమ్. సడెన్ సర్ ప్రైజ్ ఏమైనా ప్లాన్ చేసి ఉంటారా అన్న టాక్ వినిపిస్తోంది. 
ఇక ఇప్పటికే టాలీవుడ్ లో సెకండ్ వీక్ కూడా పూర్తి చేసుకుంది విరూపాక్ష సినిమా 12 రోజుల్లో 81 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. అంతే కాదు 100 కోట్ల క్లబ్ లో చేరాలని ఆరాటపడుతోంది. ఇక పాన్ ఇండియాలో ఎలాంటి రిజల్ట్ సాధిస్తుంది.. ఎంత కలెక్షన్స్ సాధిస్తుంది అనేది మెగా అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది.