సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రమాదం నుంచి కోలుకుని మునిపటిలా షూటింగ్స్ లో బిజీ అయిపోయాడు. ఇప్పటికే విరూపాక్ష చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతోంది.
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రమాదం నుంచి కోలుకుని మునిపటిలా షూటింగ్స్ లో బిజీ అయిపోయాడు. ఇప్పటికే విరూపాక్ష చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతోంది. రెండు రోజుల క్రితమే తన మేనమామ పవన్ కళ్యాణ్ తో నటిస్తున్న వినోదయ సిత్తం రీమేక్ కూడా ప్రారంభం అయింది. సాయిధరమ్ తేజ్ మునుపటిలా ఫుల్ ఫిట్ గా మంచి జోష్ లో ఉన్నాడు.
అయితే సాయిధరమ్ తేజ్ కి 2021 సెప్టెంబర్ 10న జరిగిన బైక్ ప్రమాదం మాత్రం ఒక పీడకల లాంటిదే అని చెప్పాలి. ఆ ప్రమాదం వల్ల చావు అంచుల వరకు వెళ్లిన తేజు చివరికి ప్రాణాలతో పూర్తిగా కోలుకున్నాడు. అంత పెద్ద ప్రమాదం జరిగిన తర్వాత బైక్ జోలికి వెళ్లాలంటే ఎవరికైనా భయం ఉంటుంది. కానీ ఆ భయాన్ని జయించాలని సాయిధరమ్ తేజ్ డిసైడ్ అయ్యారట.
తాజాగా విరూపాక్ష చిత్రం నుంచి ఆసక్తికర మేకింగ్ వీడియో రిలీజ్ అయింది. మేకింగ్ వీడియోలో సాయిధరమ్ తేజ్ వేగంగా బైక్ నడుపుతూ కనిపిస్తున్నాడు. ఈ సన్నివేశం గురించి దర్శకుడు కార్తీక్ దండు వీడియోలో వివరించారు. 'కోవిడ్ తర్వాత 2021 సెప్టెంబర్ లో మా విరూపాక్ష చిత్రాన్ని ప్రారంభించాలనుకున్నాం. కానీ అదే నెలలో తేజు గారు బైక్ ప్రమాదానికి గురయ్యారు. చావు వారు వెళ్లివచ్చిన వాళ్ళకి ఎవరికైన లోలోపల భయం ఉంటుంది.

ఈ చిత్రంలో బైక్ సన్నివేశం ఉంది. ఆయనేమో బైక్ యాక్సిడెంట్ నుంచి కోలుకుని వస్తున్నారు. డూప్ కి వెళ్ళితే బెటర్ అని అనుకున్నాం. ఆది చిన్న చెరువు కట్ట.. ఇటువైపు చెరువు. మరోవైపు లోయ.. దానివైపు 100 వరకు స్పీడ్ తో బైక్ రైడింగ్చేసి బ్రేక్ కొట్టాలి. అలాంటి కండిషన్స్ లో ఎవరు చేసినా రిస్క్ గానే ఉంటుంది. రిస్క్ వద్దు డూప్ పెట్టి మ్యానేజ్ చేద్దాం అని చెప్పాం. కానీ లేదు నేనే చేస్తా.. నా లో ఉన్న భయాన్ని జయించాలి అని తేజు సింగిల్ డే లో ఈ షాట్ పర్ఫెక్ట్ గా ఫినిష్ చేశారు అని డైరెక్టర్ కార్తీక్ దండు తెలిపారు.
శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తోంది. అజనీష్ లోకనాథ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. హాట్ సమ్మర్ లో ఏప్రిల్ 21న ఈ చిత్రం ప్రేక్షకులని అలరించడానికి సిద్ధం అవుతోంది.
