బ్రో మూవీ షూటింగ్ పరుగులు పెట్టిస్తున్నారు మేకర్స్. రిలీజ్ కు టైమ్ దగ్గర పడుతుండటంతో.. త్వరగా పేకప్ చెప్పేయాలి అనుకున్నారో ఏమో.. ఫారెన్ షెడ్యూల్స్ ను వరుసగా కంప్లీట్ చేస్తున్నారు.
సాయి ధరమ్ తేజ్ హీరోగా పవర్ స్టార్ పవర్ కళ్యాణ్ దేవుడి పాత్రలో కనిపించబోతున్న సినిమా బ్రో. కేతికా శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమా తమిళ సినిమా వినోదయ సీత్తం... సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతోంది. తమిళంలో ఈసినిమాను డైరెక్ట్ చేసిన సముద్రఖని తెలుగులో కూడా. ఈసినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 28న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. అయితే ఈసినిమా నుంచి సాలిడ్ అప్ డేట్ ఇచ్చాడు సాయి ధరమ్ తేజ్.
రీసెంట్ గా ఈమూవీ టీమ్ సాంగ్ షూటింగ్ కోసం ఫారెన్ కు వెళ్లారు. ఆస్ట్రియా ప్రస్తుతం బ్రో మూవీ షూటింగ్ జరుగుతుంది. ఇక అక్కడ బ్యూటిఫుల్ లొకేషన్స్ లో సాయి ధరమ్ తేజ్ అండ్ కేతిక శర్మ పై ఒక డ్యూయెట్ షూట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సాంగ్ షూట్ తో సినిమా షూటింగ్ అంతా కంప్లీట్ అయినట్టు ప్రకటించారు సాయి తేజ్.
ఇక ఆస్ట్రీయాలో షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఫోటోలను షేర్ చేస్తూ.. తనకి ఈ సినిమాలో అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతులు తెలియజేశాడు. ఇక ఈసినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈసినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.. త్వరలోనే ఈ మూవీలోని ఫస్ట్ సింగల్ ని కూడా రిలీజ్ చేయబోతున్నట్లు థమన్ అనౌన్స్ చేశాడు. ఇక పవర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు మెగా ఫ్యాన్స్ అమూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఇటీవల ఈ మూవీలోని ఒక సాంగ్ లో పవన్ స్టిల్ ని దర్శకుడు సముద్రఖని షేర్ చేశాడు. ఆ స్టిల్ చూసి.. సంజయ్ సాహు ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.
