కెరీర్ ప్రారంభంలో మంచి ఫాంలో కనిపించిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఇటీవల తడబడుతున్న సంగతి తెలిసిందే. వరుస ఫ్లాప్‌లతో కెరీర్ కష్టాల్లో పడేసుకున్న ఈ మెగా హీరో నెక్ట్స్ సినిమాలు జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు.
కెరీర్ ప్రారంభంలో మంచి ఫాంలో కనిపించిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఇటీవల తడబడుతున్న సంగతి తెలిసిందే. వరుస ఫ్లాప్‌లతో కెరీర్ కష్టాల్లో పడేసుకున్న ఈ మెగా హీరో నెక్ట్స్ సినిమాలు జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడు. అయితే అతనితో సినిమాతో చేసే నిర్మాతలకు ఓ ప్లస్ పాయింట్ కనపడుతోంది. దాంతో ఆయనతో వరస సినిమాలను చేయటానికి నిర్మాతలు ముందుకు వస్తున్నారు. '
సాయి ధరమ్ తేజ సినిమాలు థియోటర్స్ లో ఫ్లాప్ అయినప్పటికీ.. హిందీలో డబ్ అయ్యి చిత్రాలు మాత్రం యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్నాయి. ఎక్కువ వ్యూస్‌తో దూసుకుపోతున్నాయి. సాయి ధరమ్ తేజకి సంబంధించి హిందీలో డబ్ అయిన సినిమాలు.. ‘రేయ్’, సుప్రీం, జవాన్, తేజ్ ఐలవ్ యూ’ చిత్రాలు యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్‌ను రాబడుతున్నాయి. ‘రేయ్’ వచ్చేసి 9.1 మిలియన్ వ్యూస్‌ను రాబడితే.. సుప్రీం మూవీ 27 మిలియన్ వ్యూస్‌ను రాబట్టింది. ‘జవాన్’ వచ్చేసి 38 మిలియన్ల వ్యూస్‌ను రాబడితే.. ‘తేజ్ ఐ లవ్ యూ’ 37 మిలియన్ల వ్యూస్‌ను రాబట్టింది.
ఇక ప్రస్తుతం నేను శైలజ ఫేం కిశోర్ తిరుమల దర్శకత్వంలో చిత్రలహరి సినిమాలో నటిస్తున్న సాయి.. తరువాత చేయబోయే సినిమాను కూడా ఫైనల్ చేసినట్టుగా తెలుస్తోంది. పిల్ల జమీందార్ సినిమాతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న అశోక్, ఇటీవల భాగమతితో మరో విజయాన్ని అందుకున్నాడు.
ఈ దర్శకుడితో ఓ సినిమా చేసేందుకు సాయి ధరమ్ ఓకె చెప్పారని తెలుస్తోంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న చిత్రలహరి సినిమాను ఏప్రిల్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
