స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నేడు `సత్య` షార్ట్ ఫిల్మ్ నుంచి `సోల్‌ ఆఫ్‌ సత్య` అనే పాటని విడుదల చేశారు. ఈ షార్ట్ వీడియోలోని కథని, ఎమోషన్స్ ఆవిష్కరించేలా ఈ పాట సాగుతుండటం విశేషం. 

మనం దేశం కోసం పోరాడిన సైనికులనే చూసి ఉంటాం. వారినే అందరు గౌరవిస్తారు. వారి గొప్పతనాన్ని కీర్తిస్తుంటారు. వారి త్యాగాలను చర్చించుకుంటారు. కానీ సైనికుల భార్యలను ఎవరూ పట్టించుకోరు. వారి పెయిన్‌ ఏ రేంజ్‌లో ఉంటుందో ఎవరూ చెప్పలేదు. సినిమాలు కూడా ఆ వైపు చూడలేదు. తాజాగా ఆ ప్రయత్నం చేశాడు హీరో సాయిధరమ్‌ తేజ్‌. సీనియర్‌ నటుడు నరేష్‌ తనయుడు నవీన్‌ విజయ్‌ కృష్ణతో కలిసి `సత్య`(ది సోల్‌ ఆఫ్‌ సత్య) అనే షార్ట్ వీడియోని రూపొందించారు. 

తాజాగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నేడు `సత్య` షార్ట్ ఫిల్మ్ నుంచి `సోల్‌ ఆఫ్‌ సత్య` అనే పాటని విడుదల చేశారు. ఈ షార్ట్ వీడియోలోని కథని, ఎమోషన్స్ ఆవిష్కరించేలా ఈ పాట సాగుతుండటం విశేషం. తాజాగా విడుదలైన పాట ఆద్యంతం ఆకట్టుకుంటుంది. హృదయాలను హత్తుకునేలా ఉంది. అత్యంత భావోద్వేగ భరితంగానూ ఉండటం విశేషం. ఇందులో సైనికుడు సూర్య(సాయి ధరమ్‌ తేజ్‌)ని సత్య(స్వాతి) పెళ్లి చేసుకుంటుంది. తనొక మహారాణి అని, తనని యువరాజు వచ్చి తీసుకెళ్తాడని, వాళ్లమ్మ చెప్పే మాటలు వినిపెరుగుతుంది. 

చివరికి అతను రానే వచ్చాడు. సైనికుడు సూర్య ఆమెని పెళ్లి చేసుకుంటాడు. అమ్మగారింటి నుంచి భర్త ఇంటికి బిక్కుబిక్కుమంటూ వెళ్తుంది సత్య. అక్కడ మొదట్లో కాస్త బిడియంగానే ఉంటుంది. కానీ సూర్య ఇచ్చిన చనువుతో ఫ్రీ అవుతుంది. ఇద్దరు అన్యోన్యంగా, ప్రేమగా ఉంటారు. కొన్నాళ్ల తర్వాత సూర్య బార్డర్‌కి వెళ్లాల్సి వస్తుంది. అప్పటికే సత్య గర్భవతి. కొన్ని రోజుల్లోనే సత్య చేదు వార్త వింటుంది. ఆ తర్వాత పండంటి బిడ్డకి జన్మనిస్తుంది. ఇదొక ఎమోషనల్‌ జర్నీగా సాగింది. పాట ఆద్యంతం ఆకట్టుకోవడంతోపాటు హృదయాలను కదిలిస్తుంది. సైనికుడి భార్య మనో వేదనకు ఇది అద్దం పట్టేలా ఉండటం విశేషం.

దీనికి గురించి సాయిధరమ్‌ తేజ్‌ చెబుతూ, సైనికుల భార్యల త్యాగాలను, వారి మనో వేదనని తెలియజేసేలా ఈ షార్ట్ ఫిల్మ్ తీయడం ఆనందంగా ఉందని, తన బాధ్యతగా ఫీలవుతున్నట్టు చెప్పారు. అంతేకాదు వారికి దీన్ని అంకితమిస్తున్నట్టు తెలిపారు. నవీన్‌ విజయ్‌ కృష్ణలో మంచి కథకుడు ఉన్నాడని, ఈ ఐడియా చెప్పినప్పుడు చాలా ఎగ్జైటింగ్‌గా అనిపించింది. కచ్చితంగా చేయాలనిపించిందన్నారు. కమర్షియల్‌ దృష్టిలో దీన్ని చేయలేదని తెలిపారు. త్వరలో ఫిల్మ్ ని విడుదల చేస్తామన్నారు. 

ఈ సందర్భంగా దర్శకుడు నవీన్‌ విజయ్‌ కృష్ణ చెబుతూ, తాను నటుడిగా మారి తప్పు చేశానని, తన ఒరిజినాలిటీ మిస్‌ అయ్యిందన్నారు. నాన్నమ్మ విజయ్‌ నిర్మల కోసం నటుడిని అయ్యానని, తన దృష్టి మాత్రం దర్శకత్వం మీదే అన్నారు. ఆమెని చూస్తూ పెరిగానని, దర్శకురాలిగా ఆమె ప్రభావం తనపై ఉంటుందన్నారు. ఇకపై తాను దర్శకుడిగానే రాణిస్తానని, ఓ సినిమా స్క్రిప్ట్ మీద వర్కౌట్‌ చేస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం దాని కోసం వేచి చూస్తున్నానని తెలిపారు. s