హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటారు. కోమాలోకి వెళ్లారు. ఇంకా కోలుకోలేదని, కళ్లు తెరవలేని స్థితిలో ఉన్నారని ఇటీవల `రిపబ్లిక్‌` ఫంక్షన్‌లో పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. మరోవైపు శనివారం `కొండపొలం` ఈవెంట్‌లో వైష్ణవ్‌ తేజ్‌ కోలుకుంటున్నారని, త్వరలోనే డిశ్చార్ట్ అవుతారని తెలిపారు. 

సాయిధరమ్‌ తేజ్‌ గత నెలలో రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. వినాయక చవితి రోజు ఆయన బైక్‌ పై వెళ్తూ రోడ్డు యాక్సిడెంట్‌కి గురయ్యారు. దీంతో తీవ్ర గాయాలపాలైన సాయితేజ్‌ అప్పటి నుంచి హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటారు. కోమాలోకి వెళ్లారు. ఇంకా కోలుకోలేదని, కళ్లు తెరవలేని స్థితిలో ఉన్నారని ఇటీవల `రిపబ్లిక్‌` ఫంక్షన్‌లో పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. మరోవైపు శనివారం `కొండపొలం` ఈవెంట్‌లో వైష్ణవ్‌ తేజ్‌ కోలుకుంటున్నారని, త్వరలోనే డిశ్చార్ట్ అవుతారని తెలిపారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ నేపథ్యంలో సాయిధరమ్‌ తేజ్‌ ప్రమాదం తర్వాత ఫస్ట్ టైమ్‌ స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. రైట్‌ హ్యాండ్‌ థంబ్‌ ఇస్తూ ధన్యవాదాలు తెలిపారు. `నాపై, నా చిత్రం `రిపబ్లిక్‌`పై మీ ప్రేమ, ఆప్యాయతకు కృతజ్ఞతలు అనే చిన్న పదం రూపంలో తెలియజేస్తున్నా. త్వరలోనే కలుద్దాం` అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌తో మెగా అభిమానుల్లో సంతోషాలు స్టార్ట్ అయ్యాయి. 

Scroll to load tweet…

సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా నటించిన `రిపబ్లిక్‌` చిత్రం అక్టోబర్‌ 1న విడుదలైన విషయం తెలిసిందే. ఇది మిశ్రమ స్పందనని రాబట్టుకుంటోంది. దేవా కట్టా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఐశ్వర్యా రాజేష్‌ కథానాయికగా నటించగా, జగపతిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషించారు.